Viral News: సారూ పట్టించుకోండి.. ప్రజా సమస్యల పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
అధికారులు తమ సమస్యలను పట్టించుకోవట్లేదని ఓ బీజేపీ నేత వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టాడు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్య పరిష్కారం కావడం లేదని అవేదనకి గురై వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా.. కిలోమీటర్ మేర పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపాడు. ఈ నిరసనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంలో ఈ సమస్యపై ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

సహాజంగా అందోళన కార్యక్రమాలు అంటే ధర్నాలో, రాస్తారోకోలో బైఠాయింపులో ఇతర కార్యక్రమాలు చేస్తుంటారు. కాపీ ఇక్కడో బీజేపి నేత మాత్రం వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్య పరిష్కారం కావడం లేదని అవేదనకి గురై.. సుమారుగా కిలోమీటర్ మేన పోర్లుదండాలు పెట్టి నిరసన తెలిపాడు. ఇప్పుడు ఈ అందోళన కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మూడవ డివిజన్ కిసాన్ నగర్‌లో స్మార్ట్ సిటి పేరుతో గతంలో రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే రోడ్డులని తవ్వి పనులను మధ్యలో ఆపేవారు. చాలా చోట్ల డ్రైనేజి కూడా తవ్వి అలానే వదిలేశారు. ఓ వైపు అధ్వాన్నంగా ఉన్న రోడ్లు.. మరోవైపు డ్రైనేజీ దుర్వారస కారణంగా స్థానికులు నరకం చూస్తున్నారు. ఈ సమస్యపై ఎన్నోసార్లు మునిసిపల్ అధికారులకి విన్నవించిన పట్టించుకోలేదు. దీంతో అధికారుల తీరుపై విసుగుచెందిన బీజేపి దళితమోర్చ జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణుప్రసాద్ ఈ వినూత్న నిరసనకు దిగాడు.
ముందు ఒక ఫ్లెక్స్ ని ఏర్పాటు చేసి డప్పు చప్పుళ్ళ లతో ఈ రొడ్లపైనా పొర్లకుంటూ వెళ్ళాడు. గుంతలు ఉన్న దుర్వాసన వచ్చిన ఈ కార్యక్రమం ఆపకుండా ముందుకు సాగాడు. దీనితో స్థానికులు బయటికి వచ్చి అతనికి మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా చూసారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్ల పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
వీడియో చూడండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




