AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఏసీని ఈజీగా ఇలా క్లీన్ చేస్కోండి..

మీ ఏసీని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే శుభ్రం చేసుకోండి. దీనివల్ల మీ కరెంట్ బిల్లు సగానికి తగ్గి, ఏసీ జీవితకాలం పెరుగుతుంది. డోర్లు తీసి, ప్లగ్గులకు కవర్ చేసి, ఫిల్టర్లు శుభ్రం చేయండి. మోటారు లేదా పైపుతో మట్టిని తొలగించి, డెటాల్ కలిపిన నీటితో శుభ్రం చేయాలి.

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఏసీని ఈజీగా ఇలా క్లీన్ చేస్కోండి..
Home AC maintenance
Ram Naramaneni
|

Updated on: Mar 11, 2026 | 9:05 AM

Share

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఏసీని ఇంట్లోనే సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను సంవత్సరానికి ఒకసారి చేస్తే, మీ కరెంట్ బిల్లు 50% వరకు తగ్గుతుంది, ఉదాహరణకు వెయ్యి రూపాయలు వచ్చే బిల్లు సగానికి తగ్గిపోతుంది. అంతేకాకుండా, మీ ఏసీ జీవితకాలం కూడా పెరుగుతుంది. ముందుగా, ఏసీ డోర్లను జాగ్రత్తగా తీయండి. ఏసీ కింద ఉన్న ప్లగ్గులన్నింటికీ కవర్ చేసి, ప్లాస్టర్ వేయండి. తర్వాత, ఫిల్టర్లను రివర్స్ వైపు నుంచి పూర్తిగా కడగండి. ఏసీ బాడీని, ఫిల్టర్లను శుభ్రం చేయడానికి మోటారును ఉపయోగించండి. మోటారు ఫోర్స్‌తో మట్టి అంతా నీట్‌గా తొలగిపోతుంది. బ్లోయర్ ఉంటే వాడండి, లేకపోతే పైపును కనెక్ట్ చేసుకొని క్లీన్ చేసుకోండి. బ్లోయర్ వాడేటప్పుడు స్టెబిలైజర్‌ను కూడా శుభ్రం చేయండి. అందులో కూడా చాలా దుమ్ము ఉంటుంది. పళ్ళు తోముకునే స్మూత్ బ్రష్ లేదా పాల బాటిల్ బ్రష్ ఉపయోగించి శుభ్రం చేయవచ్చు. ఒక బకెట్‌లో కొద్దిగా డెటాల్ కలిపిన నీటిని తీసుకుని క్లీన్ చేయండి. ఏసీ క్లీనింగ్ పూర్తయిన తర్వాత, 10 నిమిషాలు గాలిని వదిలేయండి, ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఉండవచ్చు. బయటివాళ్లు డబ్బులు పెట్టినా ఇంత మంచిగా క్లీన్ చేయరు.

ఈ సూచనలు పాటించండి:

ఏసీ క్లీన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఫిన్స్ లేదా బ్లేడ్స్ చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి, వాటిని గట్టిగా రుద్దకూడదు. సాఫ్ట్ బ్రష్‌తో చాలా నెమ్మదిగా, స్మూత్‌గా రుద్దాలి. గట్టిగా రుద్దితే బ్లేడ్స్ వంగిపోవచ్చు. అలాగే వాటిపై ఉండే ప్రొటెక్టివ్ కోటింగ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది.

నీళ్లు కూడా ఎక్కువగా పోయకూడదు. జగ్గుతో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ శుభ్రం చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా పక్కనే ఉన్న కరెంట్ బోర్డులు లేదా ఏసీ పీసీబీ బోర్డులపై నీరు పడకుండా జాగ్రత్త పడాలి. క్లీనింగ్ చేయడానికి ముందు వాటిని కవర్‌తో బాగా కవర్ చేసి సేఫ్‌గా ఉంచాలి. ఇలా జాగ్రత్తగా క్లీనింగ్ చేస్తే మీ ఏసీకి ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు.

Follow Us