200 ఏళ్ల నాటి అరుదైన శంఖం… ఏడాదికి ఒక్కసారే…
ప్రసిద్ధ మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని అరుదైన దక్షిణావృత శంఖం, ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ పవిత్ర శంఖం నుండి లభించే తీర్థం వ్యాధులను దూరం చేస్తుందని భక్తుల నమ్మకం. పానకాల స్వామి ఆలయంలోని మరో శంఖం, దాని రెండు వందల ఏళ్ల చరిత్ర, నిత్యం వినిపించే ఓంకార నాదం వెనుక ఉన్న విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
ప్రముఖ వైష్ణవ క్షేత్రం..మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ఒక్క గోపురం, ముఖ మండపం, కోనేరులకు చారిత్రక నేపధ్యం ఉంది. నాలుగు వందల ఏళ్ల క్రితమే ముఖ మండపం నిర్మించగా రెండు వందల ఏళ్ళ క్రితం గాలి గోపురాన్ని నిర్మించారు. వీటికి తోడు రెండు వందల ఏళ్ల నాటి శంఖం కూడా ఇక్కడి ఆలయంలో ఉంది. శంఖాల్లో రెండు రకాలుంటాయి. వీటిలో దక్షిణావృత శంఖం ఎంతో విశిష్ఠమైనది. ప్రతి ఏటా వైష్ణవాలయాల్లో ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం వైభవంగా నిర్వహిస్తారు. క్షీరసాగరంపై శేషపాన్పుపై నిద్రిస్తున్న స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారు. ఈ రోజు ముక్కోటి దేవతలుకూడా స్వామివారిని దర్శించుకుంటారని చెబుతారు. అందుకు ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే శ్రీ మహావిష్ణువుతోపాటు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతారు. అలా స్వామివారిని దర్శించుకున్న అనంతరం దక్షిణావృత శంఖులోనే తీర్ధం ఇస్తారు. ఈ శంఖం ద్వారా తీసుకున్న తీర్ధం వ్యాధులు, దీర్ఘకాలిక బాధలు, గ్రహ ఇబ్బందులను తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు. ప్రతి ఏటా ఏకాదశి రోజు మాత్రమే ఈ శంఖాన్ని బయటకు తీస్తారు. మిగిలిన రోజుల్లో బ్యాంక్ లాకర్ లో భద్రపరుస్తారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎగువ ఉండే పానకాల స్వామి ఆలయంలో కూడా దక్షిణావృత శంఖం ఉంది. అయితే దీనికి రెండు వందల నాలుగేళ్ళ చరిత్ర ఉంది. 1820లో ఈ శంఖాన్ని తంజావూరు మహారాజు రెండో సర్ఫోజీ స్వామి వారిని దర్శించుకున్న సందర్భంలో బహూకరించారు. ఈ శంఖానికి బంగారు తొడుగు చేయించారు. అప్పటి నుండి ఈ శంఖం ద్వారానే ఏకాదశి రోజు తీర్థం ఇస్తుంటారు. ఈ శంఖం నుండి ప్రతి రోజూ ఓంకారం వినిపిస్తుందని అర్చకులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే ‘లాంగెస్ట్’ ఫ్లైట్ చూసారా..
Sankranti 2026: మకర సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలంటే..
ట్రంప్ గోల్డ్ కార్డ్‌తో మనోళ్లకు ఉద్యోగాలు
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది.. మ్యాటర్ ఏంటంటే..
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..

