AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

Phani CH
|

Updated on: Dec 15, 2025 | 5:17 PM

Share

వివాహితుడైన ప్రియుడి భార్య సడెన్‌గా రావడంతో, చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో ఓ మహిళ ప్రాణాలకు తెగించి 10వ అంతస్తు బాల్కనీ నుంచి తప్పించుకుంది. పైపులు, కిటికీల సాయంతో కిందకు దిగడం భయానకంగా ఉంది. ఈ ఘటనపై ఆన్‌లైన్‌లో పెద్ద చర్చ జరిగింది. కొందరు ఆమె సాహసాన్ని మెచ్చుకోగా, మరికొందరు ప్రియుడిని పిరికివాడని విమర్శించారు. చైనాలో విడాకుల రేటు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన చర్చనీయాంశమైంది.

వివాహితుడైన ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో అతని భార్య సడెన్‌గా రావడంతో ఓ మహిళ ప్రాణాలను రిస్క్‌లో పడేసింది. తప్పించుకోవడం కోసం ఏకంగా 10వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దిగడానికి ప్రయత్నించింది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో జరిగిందీ ఘటన. ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ఇంట్లో ఉండగా హఠాత్తుగా అతని భార్య వచ్చింది. దీంతో కంగారుపడిన ఆ వ్యక్తి, ప్రియురాలిని బాల్కనీలో దాక్కోమని చెప్పాడు. కిందకు చూస్తేనే కళ్లు తిరిగేంత ఎత్తులో ఉన్న బాల్కనీ రెయిలింగ్‌ను పట్టుకుని ఆ మహిళ వేలాడింది. ఆ తర్వాత పైపులు, కిటికీ అంచులను పట్టుకుంటూ జాగ్రత్తగా కిందకు దిగడం ప్రారంభించింది. ఈ భయానక దృశ్యాన్ని కింద ఉన్నవారు ఊపిరిబిగపట్టి చూశారు. కొంత దూరం కిందకు దిగాక, ఆమె ఓ ఇంటి కిటికీని తట్టి సహాయం కోరింది. ఆ ఇంటి యజమాని పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే కిటికీ తెరిచి ఆమెను లోపలికి లాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీడియో పై ఆన్‌లైన్‌లో చర్చ జరిగింది. ప్రియుడిని పిరికివాడంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. కొందరు మహిళ ధైర్యాన్ని మెచ్చుకోగా, చాలామంది ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా ఇంతటి సాహసం చేయడం మూర్ఖత్వమని విమర్శించారు. “ఒక్క అడుగు జారినా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి” అని ఒకరు వ్యాఖ్యానించారు. “ఎవరి కోసమో ప్రాణాలను ఇలా పణంగా పెట్టడం సరికాదు” అని మరో యూజర్ కామెంట్ చేశారు. చైనాలో విడాకుల రేటు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. దీన్ని అరికట్టేందుకు, విడాకులు కోరే జంటలకు ప్రభుత్వం 30 రోజుల ‘కూలింగ్-ఆఫ్’ పీరియడ్‌ను తప్పనిసరి చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే ‘లాంగెస్ట్‌’ ఫ్లైట్ చూసారా..

Sankranti 2026: మకర సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలంటే..

ట్రంప్ గోల్డ్ కార్డ్‌తో మనోళ్లకు ఉద్యోగాలు

నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది.. మ్యాటర్ ఏంటంటే..

Gold Price Today: ద్రవ్యోల్బణం ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా?