AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??

గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??

Phani CH
|

Updated on: Dec 15, 2025 | 5:50 PM

Share

బిహార్‌లోని వైశాలి జిల్లా సరసాయి గ్రామంలోని గబ్బిలాలు గ్రామస్థులకు రక్షకులుగా, దైవంగా పూజలందుకుంటున్నాయి. జామ పండ్లను వాటికి ఆహారంగా వదిలేసి, శుభకార్యాలకు ముందు పూజిస్తారు. దొంగతనాలను అడ్డుకోవడం, పంటలకు చీడపీడల నుంచి రక్షణ, విపత్తులను ముందుగా హెచ్చరించడం వంటివి ఈ గబ్బిలాలు చేస్తాయని నమ్ముతారు. ప్రకృతి పరిరక్షణ, నమ్మకాలు ఎలా కలిసిపోతాయో సరసాయి గ్రామం చక్కటి ఉదాహరణ.

బిహార్​లోని ఓ గ్రామంలో లక్షలాది గబ్బిలాలు కనిపిస్తాయి. వైశాలి జిల్లా సరసాయి గ్రామంలో ఒక చెరువు ఉంది. చెరువు గట్టుపై ఉన్న మర్రి, రావి, జామ చెట్లపై గబ్బిలాలు నివసిస్తాయి. అక్కడి జామ చెట్లపై కాసే పండ్లను ప్రజలు తీయరు. వాటిని గబ్బిలాలకు ఆహారంగా వదిలేస్తారు. అంతలా ఆ పక్షులపై సరసాయి గ్రామస్థులు ప్రేమ పెంచుకున్నారు. చెట్లపై వేలాడుతూ అవి శాశ్వతంగా అక్కడే ఉంటున్నాయి. ఆ ఊరి ప్రజలు ఏదైనా శుభకార్యానికి ముందు గబ్బిలాలను పూజిస్తారు. అంతే కాకుండా అవి తమను రక్షిస్తాయని నమ్ముతారు. సరసాయి గ్రామం దేశవ్యాప్తంగా గబ్బిలాల వల్లే పాపులర్ అయ్యింది. గబ్బిలాలు ఏదైనా అవాంఛనీయ ఘటన, ప్రకృతి వైపరీత్యం గురించి అప్రమత్తం చేస్తాయని గ్రామస్తులు అంటుంటారు. గబ్బిలాల కారణంగా తమ గ్రామంలో కొన్నేళ్లుగా దొంగతనం, దోపిడీ జరగలేదనీ ఎవరైనా చెడు ఉద్దేశంతో రాత్రిపూట గ్రామంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే ఈ గబ్బిలాలు తమ అరుపులతో మొత్తం గ్రామాన్ని అప్రమత్తం చేస్తాయని అంటున్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే, వారు చెట్టు వద్దకు వెళ్లి ప్రార్థిస్తారట. గబ్బిలాలు మాంసాహారం కాకుండా, ఈ గ్రామంలో పండ్లు తింటాయనీ అంటారు. గబ్బిలాలు ఆహారం కోసం సాయంత్రం ఎగిరిపోయి, ఉదయం తిరిగి వస్తాయి. నిశాచర జీవి అయిన గబ్బిలంతో మానవాళికి, పర్యావరణానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వరిపైరును ఆశించే పురుగులను తినడం ద్వారా పలు రకాల తెగుళ్ల నుంచి పంటను గబ్బిలాలు కాపాడతాయి. ఇవి వైరస్‌కు ఆవాసాలైనప్పటికీ.. గబ్బిలాలు జబ్బుపడవు. అయితే అభివృద్ధి, ఆధునికతల వల్ల గబ్బిలాల ఆవాసాలు ధ్వంసమవుతున్నాయి. వాటిల్లోని వైరస్​లు మానవుల్లోకి ప్రవేశించే ప్రమాదం ఏర్పడుతోంది. ప్రకృతి, దైవం మీద విశ్వాసం కలిసినప్పుడు, పర్యావరణ పరిరక్షణ ఆటోమేటిక్‌గా ఒక సంప్రదాయంగా ఎలా మారుతుందో చెప్పడానికి సరసాయి గ్రామం ఉదాహరణ. ఇక్కడి గబ్బిలాలు కేవలం జీవులు మాత్రమే కాదు. గ్రామస్థుల విశ్వాసం, సంస్కృతి, నమ్మకానికి వారసత్వం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

200 ఏళ్ల నాటి అరుదైన శంఖం… ఏడాదికి ఒక్కసారే…

ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

ప్రపంచంలోనే ‘లాంగెస్ట్‌’ ఫ్లైట్ చూసారా..

Sankranti 2026: మకర సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలంటే..

ట్రంప్ గోల్డ్ కార్డ్‌తో మనోళ్లకు ఉద్యోగాలు