AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘దురంధర్‌’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్‌

‘దురంధర్‌’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్‌

Phani CH
|

Updated on: Dec 15, 2025 | 9:21 PM

Share

రణ్‌వీర్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లు వసూలు చేసి దూసుకుపోతోంది. ఈ విజయ గాధ కొనసాగుతుండగానే, పాక్ వ్యతిరేక కంటెంట్ కారణంగా ఆరు గల్ఫ్ దేశాలు సినిమాను బ్యాన్ చేశాయి. పాకిస్తాన్‌లో వైరల్ డ్యాన్స్, మిశ్రమ సమీక్షలు ఈ చిత్రానికి మరింత ప్రచారాన్ని తెచ్చాయి. ఈ సినిమా బాలీవుడ్‌కు కొత్త ఊపిరిని ఇచ్చింది.

రణ్‌వీర్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. విడుదలైన వారంలోపే రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి త్వరలో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ‘దురంధర్‌’లోని ఓ పాటకి పాకిస్తాన్‌లో దుమ్మురేపేలా డాన్స్‌ చేయడం వైరల్‌గా మారింది. ఓ వివాహ వేడుకలో కొందరు యువకులు దురంధర్‌ పాటకు స్టేజ్‌ పై అదిరిపోయేలా స్టెప్పులేసారు. ఆ డాన్స్‌ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రేక్షకుల్లో ఒక వర్గం కథ, యాక్షన్, పెర్ఫార్మెన్స్‌లను ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం హింసాత్మక ట్రీట్‌మెంట్‌పై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి రాళ్లు పూలు విసురుతున్నారు. సినిమా పెద్ద విజయాన్ని నమోదు చేస్తున్న సమయంలోనే షాకింగ్ వార్త బయటికొచ్చింది. ‘ధురంధర్’ను ఆరు గల్ఫ్ దేశాల్లో పూర్తిగా బ్యాన్ చేసారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ, యూఏఈ ఈ ఆరు దేశాలు సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని సమాచారం. నిర్మాతలు మొదట్లో గల్ఫ్ లో విడుదల కోసం ప్రత్యేకంగా ప్రయత్నించినా, అనుమతులు లభించకపోవడంతో కొన్ని పరిమిత థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేసే ప్రయత్నం చేసారు. అయితే ఆ ప్రయత్నం కూడా పెద్దగా ఫలించలేదు. ఈ బ్యాన్‌కి ప్రధాన కారణం సినిమాలో చూపించిన పాక్‌ వ్యతిరేక కంటెంట్‌ అని తెలుస్తోంది. సినిమాలో పాకిస్థాన్‌ను టెర్రరిజం పోషించే దేశంగా చూపించడం, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌లో రాజకీయ సంకేతాలు ఉండడంతో గల్ఫ్ దేశాలు అక్కడ రిలీజ్‌కి అనుమతి ఇవ్వలేదని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గల్ఫ్ దేశాల మార్కెట్ హిందీ సినిమాలకు కీలకం. అక్కడ సినిమా పూర్తిగా ఆగిపోవడం బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది. గల్ఫ్‌లో బ్యాన్ అయినప్పటికీ, భారత్‌లో ‘ధురంధర్’ ఎలాంటి అడ్డంకి లేకుండా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నార్త్ ఇండియాలో భారీ ఓపెనింగ్స్, సౌత్ ఇండియాలో కూడా మంచి హోల్డ్ చూస్తోంది. కుటుంబ ప్రేక్షకుల కంటే యంగ్ ఆడియన్స్ నుంచి అద్భుత రెస్పాన్స్ అందుకుంటోంది. మొత్తంగా ఈ చిత్ర విజయం బాలీవుడ్‌కి ఊపిరి పోసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌

గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??

200 ఏళ్ల నాటి అరుదైన శంఖం… ఏడాదికి ఒక్కసారే…

ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

ప్రపంచంలోనే ‘లాంగెస్ట్‌’ ఫ్లైట్ చూసారా..