విషాదం అంటే ఇదే… ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
దాత నుంచి కిడ్నీ తీసుకున్న వ్యక్తి రేబీస్ వ్యాధితో మరణించాడు. స్కంక్ కాటుతో దాతకు రేబీస్ సోకింది, కానీ అది గుర్తించబడలేదు. కిడ్నీ మార్పిడి తర్వాత గ్రహీత ఐదు వారాల్లోనే రేబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. అవయవ మార్పిడికి ముందు రేబీస్ పరీక్షలు సాధారణంగా చేయరని, ఇది వైద్య లోపమని వైద్యులు పేర్కొన్నారు. అరుదైన, విషాదకర ఘటన ఇది.
దాత నుంచి కిడ్నీ తీసుకోవటమే ఓ వ్యక్తికి శాపంగా మారింది. కిడ్నీ తీసుకున్న కొన్ని రోజులకే దారుణ వ్యాధితో కిడ్నీ గ్రహీత ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని ఓహయోకు చెందిన ఇడాహో కి 2024 డిసెంబర్ నెలలో స్కంక్ అనే జీవి కరిచింది. స్కంక్ కరిచిన కొన్ని వారాలకే ఇడాహోకు రేబిస్ వ్యాధి సోకింది. రేబిస్ లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అతడ్ని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత అతడి పరిస్థితి దారుణంగా తయారైంది. అతడ్ని కాపాడాలనుకున్న డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. ఇడాహోకు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా తెలియడంతో కుటుంబసభ్యులు అతడి అవయవాలను డొనేట్ చేశారు. ఐడాహో కిడ్నీని డాక్టర్లు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అమర్చారు. కిడ్నీ తీసుకున్న 5 వారాల తర్వాత గ్రహీతకు రేబీస్ వ్యాధి సోకింది. శరీరం మొత్తం వణకటం, నిస్సత్తువ, కన్‌ఫ్యూజన్‌తో బాధపడడ్డాడు. కొద్ది రోజులకే ఊహించని విధంగా అతడు చనిపోయాడు. పోస్టుమార్టం రిపోర్టులో రేబీస్ వ్యాధి కారణంగా అతడు చనిపోయినట్లు తేలింది. ఇది అత్యంత అరుదైన సంఘటన అని డాక్టర్లు వ్యాఖ్యానించారు. డాక్టర్ల పొరపాటు కారణంగా ఈ విషాదం జరిగింది. ఇడాహోకు రేబీస్ ఉందని డాక్టర్లు అనుకోలేదు. అతడికి ఉన్న లక్షణాలను క్రానిక్ మెడికల్ కండీషన్ అనుకున్నారు. సాధారణంగా ఒకరి శరీర అవయవాలను మరొకరికి డొనేట్ చేసే ముందు హెచ్ఐవీ, హెపటైటిస్ బీ వంటి వ్యాధులకు మాత్రమే టెస్టులు చేస్తారు. రేబీస్ వ్యాధి టెస్టులు చేయరు. అదే ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇడాహో శరీర అవయవాలను చనిపోయిన వ్యక్తితో పాటు మరో ముగ్గురికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. కిడ్నీ తీసుకున్న వ్యక్తి చనిపోగానే మిగిలిన వారిని వైద్యులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే, వారిలో ఎవ్వరికీ కూడా రేబీస్ వ్యాధి లక్షణాలు కనిపించలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది

