AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత

దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు… ఆపిన పోలీసులు.. ఆ తర్వాత

Phani CH
|

Updated on: Dec 15, 2025 | 9:28 PM

Share

ప్రకాశం జిల్లాలో నకిలీ ఎమ్మెల్యే స్టిక్కర్‌తో టోల్ ఫీజులు ఎగవేస్తున్న మున్వర్ అనే వ్యక్తిని యర్రగొండపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేరుతో ఈ స్టిక్కర్‌ను తయారు చేశాడు. నంబర్ ప్లేట్‌ను కూడా మార్చి టోల్‌గేట్ల వద్ద మోసం చేశాడు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా లో వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీప్ విప్ జీ.వీ.ఆంజనేయులు పేరుతో స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు ఆపారు. కారును పరిశీలించి చూసిన పోలీసులు స్టన్‌ అయ్యారు. ఎందుకంటే కారుకు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ నకిలీదని తేలింది. వివరాల ప్రకారం.. కారుకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్టిక్కరు అతికించుకుని టోల్‌గేట్‌ల వద్ద సిబ్బంది ని బురిడీ కొట్టిస్తూ… టోల్ ఫీజులు చెల్లించకుండా దర్జాగా తిరుగుతున్న మున్వర్ అనే వ్యక్తి ని యర్రగొండపాలెం పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురం ప్రాంతానికి చెందిన మున్వర్ గతంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు వద్ద కారు డ్రైవర్ గా ఉన్నాడు. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ పై పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీప్ విప్ జీ.వీ.ఆంజనేయులు పేరుతో నకిలీ స్టిక్కర్ చేయించి అంటించాడు. అంతేకాదు, తన ఇతియాస్ కారు నెంబర్ ప్లేట్ లోని D అనే అక్షరం కనపడకుండా బ్లూ కలర్ స్టిక్కర్ అంటించి జాతీయ రహదారి పై ఉండే టోల్ గేట్స్ తోపాటు ఫారెస్ట్ టోల్ గేట్స్ వద్ద ఫీజులు చెల్లించకుండా కారును అద్దెకు తిప్పుతున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారి పై ఉన్న మిల్లంపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తుండగా మున్వర్ తన కారుతో అక్కడకు వచ్చాడు. నెంబర్ ప్లేట్ పై అనుమానం కలిగిన ఎస్సై చౌడయ్య ఆరా తీస్తుండగా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును ఆపుతారా అంటూ మున్వర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా నకిలీది కావడంతో మున్వర్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో మంది పోలీస్, ప్రెస్, ఎమ్మెల్యే, వివిధ గవర్నమెంట్ లోగోలతో వారికి సంబంధం లేక పోయినా వాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విషాదం అంటే ఇదే… ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే

‘దురంధర్‌’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్‌

తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌

గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??

200 ఏళ్ల నాటి అరుదైన శంఖం… ఏడాదికి ఒక్కసారే…