ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఇటీవల పాముల సంచారం కలకలం రేపుతోంది. నారాయణపురం గ్రామంలో ఓ రైతు పొలానికి వెళ్తుండగా భారీ నాగుపాము ఎదురుపడింది. రోడ్డుపై పడగ విప్పి తిష్ట వేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. రైతు తన సెల్ఫోన్లో రికార్డు చేసిన ఈ వీడియో స్థానికంగా వైరల్గా మారింది.