Lionel Messi : అసలు ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది..20 నిమిషాలకే మెస్సీ ఎందుకు వెళ్లిపోయారు ?
Lionel Messi : డిసెంబర్ 13వ తేదీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం చరిత్రలో నిలిచిపోయే రోజుగా భావించారు. ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చారు. తమ అభిమాన ఆటగాడిని ఒక్కసారి చూడాలనే ఉద్దేశంతో వేలాది మంది అభిమానులు ఖరీదైన టికెట్లు కొన్నారు.

Lionel Messi : డిసెంబర్ 13వ తేదీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం చరిత్రలో నిలిచిపోయే రోజుగా భావించారు. ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చారు. తమ అభిమాన ఆటగాడిని ఒక్కసారి చూడాలనే ఉద్దేశంతో వేలాది మంది అభిమానులు ఖరీదైన టికెట్లు కొన్నారు. అయితే ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. స్టేడియంలో జరిగిన అవకతవకలు, గందరగోళం కారణంగా మెస్సీ కేవలం 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే స్టేడియంలో ఉండి, భద్రతా కారణాల వల్ల అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
స్టేడియంలో ఎందుకు గందరగోళం జరిగింది?
మెస్సీ స్టేడియంలోకి అడుగుపెట్టినప్పుడు మొదట్లో వాతావరణం చాలా ఉత్సాహంగా ఉంది. అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత కెప్టెన్‌కు ప్రేక్షకులు చప్పట్లతో, నినాదాలతో స్వాగతం పలికారు. మొదట్లో మెస్సీ చాలా సహజంగా, సంతోషంగా కనిపించారు. ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయడం, నవ్వడం, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం కూడా చేశారు.
అయితే స్టేడియంలో ఉన్న పరిస్థితి నిమిషాల్లోనే మారిపోయింది. అకస్మాత్తుగా రాజకీయ నాయకులు, వీఐపీ అతిథులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులకు సంబంధించిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో మైదానంలోకి వచ్చారు. ఫోటోలు, వీడియోలు తీసుకోవాలనే ఆత్రుతతో మైదానంలో జనసందోహం అదుపు తప్పింది. ఈ సమయంలోనే మెస్సీ చాలా ఇబ్బందిగా ఫీలవడం ప్రారంభించారు.
మెస్సీ సహనం ఎందుకు కోల్పోయారు?
ఈ ప్రదర్శన మ్యాచ్‌లో పాల్గొన్న మాజీ భారత ఫుట్‌బాలర్ లాల్‌కమల్ భౌమిక్ ఈ విషయమై మాట్లాడారు. హఠాత్తుగా మైదానంలోకి వచ్చిన భారీ జనసమూహం కారణంగా మెస్సీ అసౌకర్యంగా మారారని ఆయన తెలిపారు. ప్రజలు కంట్రోల్ లేకుండా ఫోటోలు తీసుకోవడం ప్రారంభించడంతో మెస్సీ ముఖంలో ఇబ్బంది స్పష్టంగా కనిపించింది. భౌమిక్ చెప్పిన దాని ప్రకారం.. మొదట్లో ప్రశాంతంగా, సంతోషంగా ఉన్న మెస్సీ, కొన్ని క్షణాల్లోనే కోపంతో, చిరాకుతో కనిపించడం మొదలు పెట్టారు.
#WATCH | Kolkata, West Bengal: Angry fans resort to vandalism at the Salt Lake Stadium in Kolkata, alleging poor management of the event.
Star footballer Lionel Messi has left the Salt Lake Stadium in Kolkata.
A fan of star footballer Lionel Messi said, "Absolutely terrible… pic.twitter.com/TOf2KYeFt9
— ANI (@ANI) December 13, 2025
అభిమానులకు నిరాశ
గందరగోళం కారణంగా మెస్సీ తన సహనాన్ని కోల్పోయి, త్వరగా మైదానాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది. ఈ సమయంలో ఆయనతో పాటు వచ్చిన ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా పరిస్థితిపై అసంతృప్తిగా ఉన్నారు. మెస్సీ త్వరగా వెళ్లిపోవడంతో స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా నిర్వాహకుల నిర్వహణపై, భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. భద్రతను మెరుగ్గా నిర్వహించి ఉంటే, మెస్సీ ఎక్కువ సమయం మైదానంలో ఉండే వారని అభిమానులు అభిప్రాయపడ్డారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




