చిలగడ దుంపలు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న వీటిని శీతాకాలంలో తీసుకోవడం వల్ల మానసిక ఎదుగుదల, జీర్ణక్రియ మెరుగుపడతాయి. కంటి ఆరోగ్యానికి, స్థూలకాయం నివారణకు తోడ్పడతాయి. అయితే, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, మైగ్రేన్ ఉన్నవారు వీటిని తీసుకోకూడదు.