ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!
ఈ మధ్యకాలంలో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది తమ జుట్టు అందంగా, సహజ మెరుపుతో ఉండాలని కోరుకుంటారు. కానీ మారుతున్న లైఫ్ స్టైల్, వర్క్ ప్రెషర్, అనారోగ్య సమస్యల కారణంగా చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. కాగా, ఇప్పుడు మనం జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలో చూద్దాం.
Updated on: Dec 15, 2025 | 6:08 PM

మీ జుట్టు అందంగా ఉండటమే కాకుండా, జుట్టు రాలే సమస్య తగ్గాలి అంటే, ఎప్పుడూ కూడా జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. చెమట, డస్ట్ వలన జుట్టు త్వరగా పాడు అవుతుంది. అందుకే మీరు ఎక్కువగా బయట తిరిగినప్పుడు, లేదా జుట్టు తడిచిన సమయంలో త్వరగా దానిని శభ్ర పరుచుకోవాలి. లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంట.

చాలా మంది తలస్నానం చేసిన తర్వాత జుట్టును సరిగ్గా ఆరబెట్టరు.జుట్టు ఆరబెట్టకపోవడం అనేది చాలా ప్రమాదకరం. జుట్టును ఆరబెట్టకపోతే జుట్టు నుంచి వాసన రావడం, వంటి అనేక సమస్యలు ఎదురు అవుతాయి. ఇది జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

ఉల్లిపాయ రసం జుట్టుకు చాలా మంచిది. కనీసం వారంలో ఒక్కసారి అయినా సరే జుట్టుకు ఉల్లిపాయ రసం పెట్టడం వలన ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అందుకే అతిగా జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు తప్పకుండా జుట్టుకు ఉల్లిపాయ రసం పెట్టి 20 నిమిషాలు ఉండనివ్వాలి.

చలికాలం వస్తే చాలు చాలా మంది వేడినీటితో స్నానం చేస్తుంటారు. కానీ చలికాలంలో వేడి నీటితో అస్సలే స్నానం చేయకూడదంట. దీని వలన జుట్టు బలహీనపడి , త్వరగా రాలి పోతుందంట. అంతే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉన్నదంట. అందుకే గోరు వెచ్చటి నీటితో తలస్నానం చేయాలి.

కొబ్బరి పాలు కూడా జుట్టు పెరుగుదలకు చాలా మంచిది. వారంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరి పాలను జుట్టుకు పట్టించుకోవడం చాలా మంచిదంట. ఇలా చేయడం వలన జుట్టు కురుల నుంచి బలంగా తయారు అయ్యి, దృఢంగా ఉంటుందంట.



