SKIN CARE: గ్లోయింగ్, ఫ్లాలెస్ స్కిన్ కేర్ సీక్రెట్స్ రివీల్ చేసిన హాలీవుడ్ స్టార్ సింగర్!
సెలబ్రిటీల లుక్స్, గ్లోయింగ్ స్కిన్ అభిమానులకు ఆకట్టుకుంటుంది. దాని కోసం వాళ్లు ఏం చేస్తారని తెలుసుకోవడాన్ని అందరూ ఇష్టపడతారు. అయితే, సెలబ్రిటీల్లాగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేమని అనుకుంటారు. చిన్న చిన్న టిప్స్‌తో కూడా సెలబ్రిటీల వంటి యంగ్ లుక్ సొంతం చేసుకోవచ్చు. బాలీవుడ్‌తోపాటు ..

సెలబ్రిటీల లుక్స్, గ్లోయింగ్ స్కిన్ అభిమానులకు ఆకట్టుకుంటుంది. దాని కోసం వాళ్లు ఏం చేస్తారని తెలుసుకోవడాన్ని అందరూ ఇష్టపడతారు. అయితే, సెలబ్రిటీల్లాగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేమని అనుకుంటారు. చిన్న చిన్న టిప్స్‌తో కూడా సెలబ్రిటీల వంటి యంగ్ లుక్ సొంతం చేసుకోవచ్చు. బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లో కూడా సెలబ్రిటీల హెల్త్ సీక్రెట్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. ప్రస్తుతం 33 ఏళ్ల అమెరికా సింగర్, నటి, మోడల్ సెలెనా గోమెజ్ గ్లోయింగ్ స్కిన్‌పై చర్చ ఎక్కువగా జరుగుతోంది.
సెలెనా గోమెజ్ తన ఫ్లాలెస్, గ్లోయింగ్ స్కిన్ గురించి తాజాగా వీడియో షేర్ చేసింది. ఆమె తన అద్భుతమైన 7-స్టెప్ స్కిన్‌కేర్ రొటీన్‌ను వెల్లడించింది. ఈ రొటీన్‌లో కొన్ని స్టెప్స్ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ, చర్మాన్ని రేడియంట్‌గా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయని సెలెనా చెబుతోంది. మీరు కూడా ఇంట్లోనే వీటిని ఈజీగా ట్రై చేయవచ్చు! సెలెనా చెప్పిన సీక్రెట్స్ ఆమె మాటల్లోనే..
సీరమ్‌తో మేకప్ రిమూవల్
సీరమ్‌తో ముఖానికి మసాజ్ చేసుకుంటాను. స్కిన్ టైప్‌కు సూట్ అయ్యే సీరమ్‌ను మేకప్ తొలగించడానికి ఉపయోగిస్తాను. ఆ తర్వాత నీటితో ముఖం కడుక్కుంటాను.
మైసెలార్ వాటర్‌తో క్లీన్సింగ్
మేకప్ పూర్తిగా తొలగించేందుకు మైసెలార్ వాటర్ ఉపయోగిస్తాను. ఇది చర్మాన్ని శుభ్రంగా, ఫ్రెష్‌గా చేస్తుంది.

Selena Gomez
ఐ మేకప్ రిమూవల్
కళ్ల చుట్టూ మిగిలిన మేకప్‌ను మైసెలార్ వాటర్‌లో ముంచిన బ్యూటీ బ్లెండర్‌తో సున్నితంగా క్లీన్ చేస్తాను
టోనర్ అప్లికేషన్
మేకప్ ప్యాడ్‌తో టోనర్‌ను మెల్లగా ట్యాప్ చేస్తూ అప్లై చేస్తాను. ఇది చర్మాన్ని రిఫ్రెష్ చేసి, తదుపరి స్టెప్స్‌కు రెడీ అయ్యేలా చేస్తుంది.
ఫేషియల్ ఆయిల్ మసాజ్
మామూలుగా మాయిశ్చరైజర్ రాయడానికి ముందు ఆయిల్ వాడరు. అయితే, నేను ఫేషియల్ ఆయిల్‌తో మసాజ్ చేస్తాను. ఇది చర్మాన్ని డీప్‌గా నరిష్ చేస్తుంది.
వాటరీ మాయిశ్చరైజర్
తర్వాత వాటరీ మాయిశ్చరైజర్ ఉపయోగిస్తాను. ఇది త్వరగా ఇంకిపోతుంది. చర్మానికి పర్ఫెక్ట్ గ్లో ఇస్తుంది.
నరిషింగ్ క్రీమ్
చివరిగా నరిషింగ్ క్రీమ్ రాసుకుంటే రేడియంట్ గ్లో లుక్ రెడీ.
సెలెనా ఉపయోగించిన ప్రొడక్ట్స్ కొన్ని ఖరీదైనవి కావచ్చు. కానీ, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఆల్టర్నేటివ్స్‌తో ఈ రొటీన్‌ను సులభంగా రీక్రియేట్ చేయవచ్చు. ఈ రొటీన్‌తో మీ చర్మం కూడా గ్లోయింగ్‌గా మారనుంది. ట్రై చేసి చూడండి!




