- Telugu News Photo Gallery Spiritual photos If you wear gold anklets, it's as if all your wealth has eliminated.
కాళ్లకు బంగారు పట్టిలు ధరించారంటే.. మీ సంపద అంతా ఆవిరైపోయినట్టే..
ప్రస్తుతకాలంలో కొంతమంది ఫ్యాషన్ కోసం కాళ్లకు బంగారు పట్టిలు ధరిస్తున్నారు. ఇలా ధరించడం అందరిలో వారి హుందాతనాన్ని మరింత పెంచుతుంది అనుకొంటారు. మరి కాళ్లకు బంగారు పట్టిలు ధరించవచ్చా.? దీనితో నష్టాలా లేక లాభాలా .? ఈ విషయంపై పండితులు ఏం చెబుతున్నారు.? ఈ స్టోరీలో పూర్తి వివరాలతో తెలుసుకుందామా మరి..
Updated on: Dec 16, 2025 | 12:01 PM

సాంప్రదాయ నమ్మకం: కొన్ని సంస్కృతులలో, ముఖ్యంగా హిందూవులు బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా చెబుతారు అందువల్ల నడుము క్రింద ధరించడం తగనిదిగా పరిగణించబడుతుంది. బంగారు పట్టిలు పాదాలపై ధరించడం లక్ష్మీని అగౌరవపరచినట్లు పరిగణించబడుతుంది.

పద్ధతులు: చాలా మంది హిందూ మహిళలు సాంప్రదాయకంగా బంగారు పట్టిలు లేదా కాలి ఉంగరాలు ధరించరు. అయితే కొన్ని సంస్కృతులలో వివాహిత స్త్రీలలో పెద్దవాళ్ళ విషయంలో మినహాయింపులు ఉండవచ్చు.

సంపద తగ్గుదల: జ్యోతిష్యం ప్రకారం.. కాళ్లకు బంగారు పట్టిలు లేదా కాలి ఉంగరాలు దర్శించడం అపచారం. ఇలా ధరించడం వల్ల సంపద నశిస్తుందని, వృత్తిలో పురోగతి లభించాదని అంటున్నారు పండితులు.

ప్రతికూల ప్రభావాలు: కాళ్లకు బంగారు నగలు ధరించడం ప్రతికూలతను సూచిస్తుందని పండితులు అంటున్నారు. బంగారు పట్టిలు ధరించం వల్ల దుష్ట శక్తులతో పీడించబడతారని చాలామంది హిందువుల నమ్మకం

ఆధునిక పద్ధతులు: కొంతమంది యువతులు ఫ్యాషన్, హుందాతనం కోసం కాళ్లకు బంగారు పట్టిలు ధరించినప్పటికీ సాంప్రదాయకంగా దినిని తప్పుగా భావిస్తున్నారు పండితులు. కాళ్లకు బంగారం ధరించడం అశుభమని అంటున్నారు.




