మార్కెట్లో కల్తీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చర్మ వ్యాధులకు వాడే క్రీములు, ఆయింట్మెంట్ల విషయంలోనూ నకిలీ బెడద తప్పడం లేదు. ఢిల్లీ శివార్లలో ఒక ఫ్యాక్టరీని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించి దాడులు నిర్వహించారు. ఇద్దరిని అరెస్టు చేసి భారీగా నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వీటిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.