Bank Loan: రూ.20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి లోన్.. ఒకే ఒక్క క్లిక్‌తోనే.. ఎవరైనా పొందొచ్చు
Mudra Loan: కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా..? కానీ మీ దగ్గర సరిపోయేంత డబ్బులు లేవా..? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు వ్యాపారానికి అవసరమయ్యే నిధులు రుణం రూపంలో పొందే అవకాశముంది. వీటికి ఎలాంటి వడ్డీ ఉండదు.

నిరుద్యోగులు లేదా కొత్తగా ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తోంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. బిజినెస్ ఐడియా ఉన్నా స్టార్ట్ చేయడానికి ఆర్ధిక స్తోమత సరిపోదు. దీంతో కొంతమంది వ్యక్తుల నుంచి అప్పు తెచ్చి వ్యాపారం ప్రారంభిస్తూ ఉంటారు. ఇక మరికొంతమంది బ్యాంకుల నుంచి బిజినెస్ లోన్ వంటికి తీసుకుంటారు. వ్యాపారం చేయాలనుకునే ఔత్సాహికులకు కేంద్ర ప్రభుత్వం నిధుల ఇబ్బంది లేకుండా లోన్స్ ఇస్తోంది. ఇందుకోసం ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. ఈ పధకం అర్హతలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ప్రభుత్వం నుంచి ఎంతవరకు లోన్ పొందవచ్చు? అనే విషయాలు చూద్దాం.
రూ.20 లక్షలకు పెంపు
ముద్రా(MUDRA) అంటే మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ అని అర్థం. 2015లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. అప్పటినుంచి వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి లోన్లు ఇస్తోంది. స్వయం ఉపాధి, సూక్ష్మ, చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి ఎలాంటి హామీ లేకుండా రుణాలు మంజూరు చేస్తోంది. గతంలో రూ.10 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉండగా.. ఇప్పుడు ఆ లిమిట్‌ను రూ.20 లక్షల వరకు పెంచారు. 2014 బడ్జెట్‌లో నిర్ణయం ప్రకటించారు. ఈ పథకంలో ఎక్కువమంది మహిళలు లబ్ది పొందుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఎవరికి ఎంత..?
ఈ పధకంలో వ్యాపారానికి అవసరమయ్యే నిధులను బట్టి మూడు కేటగిరీలు ఉన్నాయి. శిశు అనే కేటగిరీ కింద కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునేవారికి రూ.5 లక్షల వరకు లోన్ ఇస్తారు. ఇక కిషోర్ అనే కేటగిరీ కింద అప్పటికే ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేయాలనుకునేవారికి రూ.5 లక్షల వరకు రుణం అందిస్తారు. ఇక తరుణ్ అనే కేటగిరీ కింద రూ.10 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంది. ఇక తరుణ్ లోన్ తీర్చినవారికి రూ.20 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు.
కావాల్సిన డాక్యుమెంట్స్
ఆధార్, బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్, బ్యాంక్ స్టేట్ మెంట్స్, ఫొటోలు అందించారు. వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇంతకముందు ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకుని ఎగ్గొట్టి ఉండకూడదు.
దరఖాస్తు ఎలా..?
www.udyamimitra.in వెబ్‌సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. లేదా ఏదైనా బ్యాంక్‌కు వెళ్లి ముద్ర లోన్ పథకం కూడా అప్లికేషన్ పెట్టుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు అన్ని బ్యాంకులు ముద్ర లోన్ మంజూరు చేస్తున్నాయి.




