పెళ్లి అంటే కేవలం ఆడంబరాలు కాదని, సామాజిక బాధ్యత అని నేటి తరం దంపతులు నిరూపిస్తున్నారు. తమ పెళ్లి ఖర్చులను అనాథ బాలల చదువులు, పోటీ పరీక్షల విద్యార్థుల పుస్తకాలు, విపత్తు బాధితులు, క్యాన్సర్ రోగుల సంరక్షణకు ఉపయోగిస్తున్నారు. అలాగే, పర్యావరణహిత పెళ్లిళ్లకు ప్రాధాన్యత ఇస్తూ స్ఫూర్తినిస్తున్నారు.