Allu Arjun: అల్లు అర్జున్ జోడిగా ఆ ముగ్గురు పాన్ ఇండియా హీరోయిన్స్.. అట్లీ సినిమాలో బాలీవుడ్ తారలు..
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బన్నీ. ఇటీవలే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన సైతం వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

పుష్ప 2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టంచాడు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత అట్లీ తెరకెక్కిస్తోన్న సెకండ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. కొన్నాళ్లుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజాగా ఈ ప్రాజెక్టులో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కనిపించనున్నారనే న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ విషయమేంటంటే..
ఐకాన్ స్టా్ర్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న నెలకొంది. ఆ సినిమాలో కనిపించే కథానాయిక గురించి రోజుకో న్యూస్ వినిపిస్తుంది. నివేదికల ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడట. అంటే ఇందులో బన్నీ త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. ద్విపాత్రాభినయం కాకుండా ఇలా మూడు పాత్రలలో కనిపించడం ఇది మొదటిసారి. ఇప్పుడు లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని టాక్.
ఈ చిత్రంలో బన్నీ జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తుందని ముందుగా ప్రచారం నడిచింది. ఆ తర్వాత జాన్వీ కపూర్, దిశా పటానీ సైతం ఈ చిత్రంలో భాగమవుతారని అంటున్నారు. అల్లు అర్జున్, అట్లీ కాంబో అంటే ఈ ప్రాజెక్టులో నటించేందుకు బాలీవుడ్ స్టార్స్ సైతం అంగీకరిస్తారు. దీంతో ఈమూవీలో ముగ్గురు హీరోయిన్స్ కనిపించనున్నారని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమా 2026 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఇవి కూడా చదవండి :