AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayashanthi : పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. స్పందించిన విజయశాంతి.. ఏమన్నారంటే..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడడంతో.. భారత్ కు వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.

Vijayashanthi : పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. స్పందించిన విజయశాంతి.. ఏమన్నారంటే..
Vijayashanthi, Pawan Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 16, 2025 | 10:18 AM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా భయటపడడంతో భారత్ వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు సైతం సమర్పించుకుంది. క్రిస్టియన్ అయినా అన్నా లెజినోవా ఆలయ నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి.. హిందూ సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూ శ్రీవారికి మొక్కు చెల్లించుకుంది. అనంతరం నిత్యాన్నాదనం కోసం రూ.17 లక్షలు విరాళం అందచేసింది. అంతేకాకుండా భక్తులతో కలిసి నిత్యాన్నాదనంలో పాల్గొంది. విదేశాల్లో పుట్టిపెరిగిన అన్నా లెజినోవా.. భారత్ కు వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం.. క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరించడంపై ఆమెపై ప్రశంసలు వచ్చాయి. కొడుకు కోసం అన్నా లెజినోవా చేసిన మంచి పనిని చాలా మంది పొగిడారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం అన్నా లెజినోవా తీరుపై నెట్టింట ట్రోల్స్ చేశారు.

క్రిస్టియన్ అయి ఉండి తిరుమలకు రావడం ఏంటీ.. ? తలనీలాలు ఇవ్వడం ఏంటీ ? అంటూ కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. తాజాగా అన్నా లెజినోవాపై వచ్చిన ట్రోల్స్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ హీరోయిన్ విజయశాంతి సీరియస్ అయ్యారు. తన ట్విట్టర్ ఖాతాలో అన్నా లెజినోవాపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఆమెను ట్రోల్స్ చేసిన వారిపై అసహనం వ్యక్తం చేశారు. దేశం కానీ దేశం నుంచి వచ్చి వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అని అన్నారు.

ఇవి కూడా చదవండి

“దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు. హరహర మహాదేవ్, జై తెలంగాణ” అంటూ ట్విట్టర్ ఖాతాలో రాసుకోచ్చారు విజయశాంతి.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?