Yagnam Movie: అరె ఏంట్రా ఇది.. గోపిచంద్ యజ్ఞం హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. ఇప్పుడేం చేస్తుందంటే..
తొలి సినిమాకే సూపర్ హిట్ అందుకుని అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మూవీలోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ అందాల తారలు.. అనుకోకుండా సినిమాలకు దూరమయ్యారు. అందులో సమీరా బెనర్జీ ఒకరు. తెలుగు చిత్రపరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా.

టాలీవుడ్ హీరో గోపిచంద్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ యజ్ఞం. అప్పటివరకు విలన్ పాత్రలతో అలరించిన గోపిచంద్ కు హీరోగా సరైన బ్రేక్ ఇచ్చిన మూవీ ఇదే. ఈ సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేసిన గోపిచంద్.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది సమీరా బెనర్జీ. అలియాస్ మూన్ బెనర్జీ. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. యజ్ఞం తర్వాత మరో ప్రాజెక్టులో కనిపించలేదు.
కోల్ కత్తాకు చెందిన సమీరా బెనర్జీ .. 1997 నుంచి హిందీ సీరియల్స్ చేస్తుంది. బాలీవుడ్ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీరా.. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అటు సీరియల్స్ చేస్తూనే అటు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. యజ్ఞం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.ఈ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ సమీరాకు తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. అలాగే మరే భాషలోనూ సినిమా చేయలేదు. దీంతో తిరిగి సీరియల్స్ లోకి వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఆమె హిందీలో దోరి అనే సీరియల్లో నటిస్తుంది. ఒకప్పుడు అందంతో మాయ చేసిన సమీరా.. ఇప్పుడు బుల్లితెరపై అత్త పాత్రలు పోషిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా సమీరా లేటేస్ట్ లుక్ చూసి తెలుగు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. యజ్ఞం సినిమాలో ఎంతో అందంగా కనిపించిన సమీరా.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :