Venky Atluri: మరో స్టార్ హీరోను లైన్లో పెట్టిన లక్కీ భాస్కర్ డైరెక్టర్.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే..
డైరెక్టర్ వెంకీ అట్లూరి.. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను అందుకున్న దర్శకుడు. కొన్నాళ్లుగా ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలు అడియన్స్ హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఇప్పటికే ధనుష్ తో కలిసి సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ.. ఇటీవల దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ మూవీతో మరో హిట్ అందుకున్నారు. తాజాగా మరో హీరోను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతంగా దూసుకుపోతున్న దర్శకులలో వెంకీ అట్లూరి ఒకరు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పటికే సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారట. అతడు మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ అజిత్. ఇటీవలే విడాముయార్చి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు అజిత్ కుమార్. ఫిబ్రవరి 6, 2025న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించింది. ఇక ఇప్పుడు థియేటర్లలో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ దూసుకుపోతుంది. ఏప్రిల్ 10, 2025న థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో మరోసారి అజిత్ సరసన త్రిష నటించింది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే 100 కోట్లకుపైగా వసూలు చేసింది.
ఈ క్రమంలోనే డైరెక్టర్ అజిత్ తర్వాత ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తాడో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు లేటేస్ట్ సమాచారం ప్రకారం అజిత్ నెక్ట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారని టాక్. ధనుష్ నటించిన వాతి (సార్ ) సినిమాతో తమిళ్ సినీప్రియులకు దగ్గరయ్యారు వెంకీ అట్లూరి. తెలుగు సినిమా శైలిలో రూపొందించబడినప్పటికీ, తమిళ అభిమానులను ఆకట్టుకుంది.
ఇటీవలే వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు థియేటర్లలో భారీ వసూల్లు వచ్చాయి. విభిన్న కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు వెంకీ అట్లూరి, అజిత్ కాంబోలో ప్రాజెక్ట్ వస్తుందని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

Ajith,
ఇవి కూడా చదవండి :