Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Ram: రాజ్ తరుణ్ చేయాల్సిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ ఇచ్చిన ఆ ఒక్క సలహాతో..

సాధారణంగా సినీరంగంలో ఒక హీరోకు రాసుకున్న కథ మరో హీరోకు వద్దకు చేరుతుంది. ఒక హీరో ఖాతాలో పడాల్సిన బ్లాక్ బస్టర్ హిట్ మరో కథానాయకుడి చేతిలో పడుతుంది. అలాగే కొందరు స్టార్స్ చివరి క్షణంలో భారీ డిజాస్టర్స్ నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే. యంగ్ హీరో రాజ్ తరుణ్ చేయాల్సిన కథతో భారీ విజయాన్ని అందుకున్నారు కళ్యాణ్ రామ్. ఇంతకీ ఏ సినిమా అంటే..

Kalyan Ram: రాజ్ తరుణ్ చేయాల్సిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ ఇచ్చిన ఆ ఒక్క సలహాతో..
Raj Tarun, Kalyan Ram
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 16, 2025 | 8:35 AM

ప్రస్తుతం అర్జున్ s/o వైజయంతి సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఇందులో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలకపాత్రలో నటిస్తుండగా.. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తుండగా.. ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సైతం హైప్ పెంచగా.. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా కళ్యాణ్ రామ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ మిస్సైన కథతో కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారట. ఆ సినిమా ఏంటో కాదు.. బింబిసార. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను డైరెక్టర్ వశిష్ట తండ్రి.. నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

డైరెక్టర్ వశిష్టకు దర్శకుడిగా పలు ప్రయత్నాలు విఫలమైన తర్వాత రాజ్ తరుణ్ తో కలిసి తన తొలి సినిమాను ఫిక్స్ అయిపోయారట. కానీ అప్పుడు మార్కెట్ దృష్ట్యా రాజ్ తరుణ్ తో సినిమా తీసేందుకు ఓ నిర్మాత ఇంట్రెస్ట్ చూపించలేదట. ఇక ఈ సినిమా కథ గురించి తెలుసుకున్న మరో ప్రోడ్యూసర్ కళ్యాణ్ రామ్ తో చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. అప్పటికే కళ్యాణ్ రామ్ కు వేరే కథ చెప్పిన వశిష్ట.. ప్రొడ్యూసర్ సలహా మేరకు మరోసారి కలిసి రాజ్ తరుణ్ చేయాల్సిన స్టోరీని చెప్పారట. కథ బాగా నచ్చడంతో.. బడ్జెట్ చర్చల అనంతరం తమ బ్యానర్ లోనే సినిమా రూపొందుతుందని మాటిచ్చారట కళ్యాణ్ రాణ్. అయితే రాజ్ తరుణ్ తో తీయాలనుకున్నప్పుడు ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు వశిష్ట. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన సలహాతో ఈ మూవికి బింబిసార అనే టైటిల్ ఖరారు చేశారట. 2022లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

దర్శకుడిగా వశిష్ట ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న వశిష్ట.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా జూలైలో విడుదలకానుంది. బింబిసార కంటే ముందు వశిష్ట.. నితిన్, రవితేజ, అల్లు శిరీష్ వంటి స్టార్ హీరోలకు కథలు చెప్పారని.. కానీ అనివార్య కారణాలతో వాళ్లతో సినిమాలు సెట్ కాలేదని అన్నారు సత్యనారాయణ.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..