మీ ఆవిడను సినిమాకు తీసుకెళ్లండి పాపం.. శ్రీముఖి రిప్లేతో వైరల్ అవుతున్న వీడియో
సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం. గతంలో సామ్ తోనే జబర్దస్త్, ఓ బేబీ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. జూన్ 19 రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టార్ హిట్ అందుకుంది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు నందిని రెడ్డి. ఈ చిత్రంలో సమంతతో పాటు పోషించగా, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచలే, గౌతమి, శ్రీముఖి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మా ఇంటి బంగారం సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
మా ఇంటి బంగారం సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. సమంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే సమంత నటనను కొనియాడుతున్నారు. యాక్టింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టారు సామ్. సమంతతో పాటు యాంకర్ శ్రీముఖి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఆమె తన నటనతో ఆడియన్స్ ను కట్టిపడేసిందనే చెప్పాలి.
శ్రీముఖి యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించింది ప్రేమ ఇష్క్ కాదల్ , జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, భోళా శంకర్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తాజాగా మాఇంటి బంగారం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. దాంతో శ్రీముఖికి వరుస ఆఫర్స్ క్యూ కట్టడం ఖాయం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మా ఇంటి బంగారం సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ రీల్ పై శ్రీముఖి స్పందించింది. ఓ మహిళ తన భర్తతో కలిసి రీల్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి శ్రీముఖి కామెంట్ చేసింది. నా భర్త నన్ను సినిమాకు తీసుకెళ్లడం లేదు శ్రీముఖి గారు మీరైనా కామెంట్ చేసి చెప్పండి అని ఆ మహిళ వీడియోలో రిక్వెస్ట్ చేసింది. దానికి శ్రీముఖి కామెంట్ చేస్తూ తీసుకెళ్లండి పాపం అని రాసుకొచ్చింది. దాంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.
శ్రీముఖి కామెంట్ చేసిన రీల్ ఇదే..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
