AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ దర్శకుడు నువ్వు మానేయ్ అని నా ముఖంమీదే చెప్పాడు.. అసలు ఏం జరిగిందంటే

దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత అభిప్రాయాలు, ఇతర దర్శకులు, నటీనటులపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఓ దర్శకుడు తనను సినిమా నుంచి తీసేశారని తెలిపారు.

ఆ దర్శకుడు నువ్వు మానేయ్ అని నా ముఖంమీదే చెప్పాడు.. అసలు ఏం జరిగిందంటే
Krishna Vamsi
Rajeev Rayala
|

Updated on: Jun 24, 2026 | 8:06 AM

Share

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన కెరీర్ ప్రారంభ దశలో రామ్ గోపాల్ వర్మతో తన అనుబంధం, ఎదురైన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. నేను వర్మ అనే గంధపు చెట్టు కింద పెరిగిన ఒక గడ్డి మొక్కలాంటి వాడిని, ఆయన స్ఫూర్తి వల్లే తన శైలి ఏర్పడిందని కృష్ణవంశీ పేర్కొన్నారు. ఆర్జీవీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కేవలం ఆలోచనా విధానంలో తేడాలు మాత్రమే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య మొదటిసారి విభేదాలు తలెత్తింది అనగనగా ఒక రోజు సినిమా సమయంలోనే. వర్మ ఒకలా ఉండాలంటే, కృష్ణవంశీ మరోలా ఉండాలని కోరుకునేవారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా బడ్జెట్ అదుపు తప్పిందని, ఆ సినిమాకు ఆర్జీవి నిర్మాతగా కూడా చేశారు. సినిమా డైరెక్షన్ ను నేనే చూసుకునేవాడిని, ఆ సమయంలో బడ్జెట్ పెరిగిపోతుందని వర్మ రెండుసార్లు హెచ్చరించారని కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు. అప్పటికే హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న వర్మ, ఒకరోజు తన సినిమా ఎగ్జిగిటివ్ ప్రొడ్యూసర్ తో లెక్కలు చూసి, కృష్ణవంశీని పిలిచి ప్రాజెక్ట్ నుండి తప్పుకోమని కోరారట. “నువ్వు మానేయ్” అన్న వర్మ మాటలను తాను స్వీకరించి, ఆ తర్వాత అదే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొనసాగడానికి సిద్ధపడ్డానని కృష్ణవంశీ తెలిపారు.

తన బాస్ సంస్థలో తాను ఎప్పుడూ అసిస్టెంట్ డైరెక్టర్‌నేనని, బాస్ ఆదేశాలను పాటించడంలో ఏమాత్రం సంకోచం లేదని ఆయన వివరించారు. కొన్నిసార్లు వర్మ తనకు కీలక సన్నివేశాలను డైరెక్ట్ చేసే అవకాశాన్ని కూడా ఇచ్చారని, అలాంటి సమయాల్లో తాను డైరెక్టర్ అని ఎప్పుడూ భావించలేదని ఆయన పేర్కొన్నారు. అనగనగా ఒక రోజు నుంచి తీసేయడం గిల్ట్ ను కలిగించిందని, మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాను, ఇంతకాలం కష్టపడి ఈ స్టేజ్ నేను తెచ్చుకోలేకపోయాను అని అనుకున్నానని కృష్ణవంశీ వెల్లడించారు. ఈ సంఘటన తనను పట్టుదలగా పనిచేయడానికి ప్రేరేపించిందని, మళ్లీ మనం పైకి రావాలి అనే సంకల్పంతో గులాబీ కథను సిద్ధం చేసుకున్నానని తెలిపారు.

తొలుత గులాబీ కథను బయట ప్రయత్నించగా, రామ్ గోపాల్ వర్మే స్వయంగా పిలిచి కథ వినిపించమన్నారని కృష్ణవంశీ చెప్పారు. “సార్ మీ ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు, ఇది మీకు నచ్చకపోవచ్చు” అని కృష్ణవంశీ చెప్పినప్పటికీ, వర్మ పట్టుబట్టి, కథ కాకుండా బడ్జెట్ గురించి చెప్పమని కోరారు. చివరకు తన పేరు మీదుగానే గులాబీని డైరెక్ట్ చేయమని వర్మ సూచించారు. గులాబీ సినిమా డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత కూడా వర్మ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారని కృష్ణవంశీ వివరించారు. వర్మ సూచించిన కరెక్షన్స్‌తోనే గులాబీ విడుదలయ్యిందని ఆయన అన్నారు. గులాబీ తనను తాను రీసెరెక్ట్ మైసెల్ఫ్ చేసిన ప్రయత్నమని, ఆ విజయంపై తాను ఎంతో గర్వపడుతున్నానని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.

Rgv

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us