AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్షలాది TET అభ్యర్థులకు కీలక సమాచారం.. ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది

TG TET 2026 result date: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) జూన్ 2026 పరీక్షలు జూన్ 22తో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 74.81 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. జూన్ 30న ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల కానుండగా, జూలై 2 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అభ్యర్థుల అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది ఆన్సర్ కీ విడుదల చేసి, జూలై 28 నుంచి 31 మధ్య ఫలితాలను ప్రకటించనున్నారు..

లక్షలాది TET అభ్యర్థులకు కీలక సమాచారం.. ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది
TG TET Result Date
Srilakshmi C
|

Updated on: Jun 24, 2026 | 7:24 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 24: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్‌ జూన్‌ 2026) పరీక్షలు సోమవారం (జూన్‌ 22)తో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకోంగా.. ఇందులో 1,15,028 మంది అంటే 74.81శాతం మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. 38,724 మంది ఈ పరీక్షకు గైర్హాజరయ్యారు. జూన్‌ 14 నుంచి 22 వరకు రోజుల పాటు మొత్తం పది సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు నిర్వహించారు. జులై 28 నుంచి 31 మధ్యలో ఫలితాలు విడుదల కానున్నాయి.

టీజీ టెట్ పరీక్షలు ముగియడంతో ప్రాథమిక కీల విడుదలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 30న ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల చేయనున్నారు. ఈ ప్రాథమిక కీ పై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని జూలై 2వ తేదీ లోపు వెబ్‌సైట్ ద్వారానే ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు గడువులోగా తమ అభ్యంతరాలను తగిన ఆధారాలతో అధికారిక పోర్టల్‌లో నమోదు చేస్తే.. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఆన్సర్‌ కీ రూపొందించి జూలై 28 నుంచి 31 తేదీల మధ్య ఫలితాలను విడుదల చేస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ బడుల్లో ఖాళీగా 14, 171 టీచర్‌ పోస్టులు

మరోవైపు సర్కార్‌ బడుల్లో 14, 171 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిలో 13,061 టీచర్‌ పోస్టులు ఎలిమెంటరీ స్థాయిలోనే ఖాళీగా ఉన్నాయి. మరో 1110 టీచర్‌ పోస్టులు సెకండరీ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 27వేల స్కూ ళ్లుండగా మొత్తంగా 1,26,820 టీచర్‌ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 1,13,057 టీచర్లు పనిచేస్తున్నారు. ఇక 14,171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ల రిటైర్మెంట్లు సైతం పెరుగుతుండటంతో.. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Follow Us
లక్షలాది TET అభ్యర్థులకు కీలక సమాచారం.. ఫలితాల విడుదల తేదీ ఇదే
లక్షలాది TET అభ్యర్థులకు కీలక సమాచారం.. ఫలితాల విడుదల తేదీ ఇదే
జామపండు vs అరటిపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
జామపండు vs అరటిపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు
డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అమృతం కాదు విషం.. ఈ విషయాలు కచ్చితంగా..
డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అమృతం కాదు విషం.. ఈ విషయాలు కచ్చితంగా..
ఇంటర్ అర్హత.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు
ఇంటర్ అర్హత.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు
పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్..
పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్..
ఒకప్పుడు సమోసాలు అమ్మాడు.. ఇప్పుడు12,490 కోట్ల ఆస్తులున్న హీరో
ఒకప్పుడు సమోసాలు అమ్మాడు.. ఇప్పుడు12,490 కోట్ల ఆస్తులున్న హీరో
భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. కీలక భేటీ
భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. కీలక భేటీ
విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు..
విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు..