Telangana: ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే అకౌంట్లోకి రూ.1.20 కోట్లు.. వీరికి తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..
ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. రూ.1.20 కోట్ల బీమా కవరేజీ ఉచితంగా కల్పించనుంది. ఈ మేరకు ఎలాంటి ప్రీమియం కట్టకుండానే బీమా కవరేజీ అందించనుంది. ఎంప్లాయిస్ లైఫ్ ఇన్యూరెన్స్ పథకం పేరుతో దీనిని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్‌న్యూస్ తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్ల ఉచిత బీమా పథకాన్ని ఈ నెల 25వ తేదీన ప్రారంభించనుంది. ఈ పథకాన్ని రవీంద్రభారతిలో జరగనున్న కార్యక్రమంలో ఆ రోజున మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఎంప్లాయిస్ లైఫ్ ఇన్యూరెస్స్ స్కీమ్ పేరుతో దీనిని అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సహజ మరణం పొందినా లేదా ప్రమాదవశాత్తూ మరణించినా కుటుంబానికి రూ.1.20 కోట్ల సొమ్ము అందుతుంది. ఇందుకోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల తరపున ప్రభుత్వమే బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది. ఈ పథకం అమలు కోసం రేవంత్ సర్కార్ ఇప్పటికే బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.
బ్యాంకులతో కీలక ఒప్పందాలు
అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల ఖాతాలు ఉన్న అన్ని ప్రముఖ బ్యాంకులతో ఎంవోయూ కూడా చేసుకుంది. దీని వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా క్లెయిమ్ సొమ్ము లబ్దిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. సహజ, ప్రమాద మరణాలకు బీమా రక్షణ ఉంటుంది. బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందాలు పూర్తి కావడంతో ఎల్లుండి ప్రథకం ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కొత్తగా ఈ పథకం తీసుకొచ్చారు. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగులు రూ.1.20 కోట్ల భారీ కవరేజీ పొందవచ్చు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్ధిక భరోసా కల్పించాలనే లక్ష్యతో ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది ఉద్యోగులకు భారీ ప్రయోజనం చూకూర్చే పథకంగా చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఈ పథకంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయి. ఈ పథకంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతుండగా.. ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుందనే విషయంపై మొన్నటివరకు క్లారిటీ రాలేదు. ఇప్పుడు అసలు క్లారిటీ వచ్చేసింది.
ఉద్యోగులకు ఆహ్వానం
రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమానికి రావాల్సిందిగా ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వం కోరింది. భారీ ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఆహ్వానించింది. ఉద్యోగులు తమ వెంట ఐడీ కార్డులు తెచ్చుకోవాలని తెలిపింది. అటు ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉనన ఉద్యోగ సంఘాలు, యూనియన్లు, సంస్థలు తమ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రతినిధులు హాజరు కావాలని తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ జేఏసీ సూచించింది.
