- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Made Body Shaming Comments In College Days, Now She Is Top Heroine In South, She is Divya Bharathi
Tollywood: ఇదేం అరాచకం రా బాబూ.. అందంగా లేదని కామెంట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేస్తోన్న హీరోయిన్..
కాలేజీ రోజుల్లో అందంగా లేదంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు అందాలతో సౌత్ ఇండస్ట్రీనే ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో మతిపోగొట్టేస్తోంది ఈ వయ్యారి. ఇన్నాళ్లు కన్నడలో వరుస సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
Updated on: Apr 16, 2025 | 11:54 AM

సోషల్ మీడియాలో అందాల భీభత్సం సృష్టిస్తోన్న ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ? తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకుండానే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు.. కాలేజీ రోజుల్లో ఆమె అందంగా లేదంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారట. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ?

తనే హీరోయిన్ దివ్య భారతి. ఈ పేరు తెలియని వారుండరు. కన్నడ చిత్రపరిశ్రమలో తోపు హీరోయిన్. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో సినీరంగంలోకి కథానాయికగా అడుగుపెట్టింది దివ్య భారతి.

మొదటి సినిమాలోనే ఊహించని రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగే కన్నడలో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

1992లో జనవరి 28న జన్మించిన దివ్య భారతి.. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తి పెంచుకుంది. గ్రాడ్యూయేషన్ పూర్తి కాగానే సినీరంగంలోకి అడుగుపెట్టింది. బ్యాచిలర్ సినిమాతో యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. మధిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, ఆసై, మహారాజా వంటి చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సరసన GOAT చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది దివ్య భారతి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.





























