- Telugu News Photo Gallery Cinema photos Malayalam Actress Vincy Aloshious Reveals How Male Co Star Insisted On Fixing Her Dress In Public Under Drug Influence
Tollywood: ఆ హీరో తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బందిపెట్టాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
సినీరంగంలో మహిళలు ఎదుర్కోనే సమస్యల గురించి తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు సంఘటనల గురించి బహిరంగంగా మాట్లాడారు. మరికొందరు మాత్రం తమకు ఎదురైన ఇబ్బందుల గురించి మౌనంగానే ఉండిపోయారు. తాజాగా మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
Updated on: Apr 16, 2025 | 1:34 PM

మలయాళీ నటి విన్సీ సోనీ అలోషియస్.. పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక సినిమ సెట్స్ లో ఓ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. కానీ అతడి పేరు వెల్లడించలేదు.

సినిమా షూటింగ్ సమయంలో ఆ హీరో డ్రగ్స్ తీసుకున్నాడని.. తనతో అనుచితంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది విన్సీ సోనీ అలోషియస్. ఆ మూవీ షూటింగ్ జరిగినన్ని రోజులు తాను ఎంతో ఇబ్బందిపడ్డానని.. తన ముందే దుస్తులు మార్చుకోవాలని ఇబ్బందిపెట్టాడని తెలిపింది.

అందరి ముందే అలాంటి మాటలు మాట్లాడేవాడని.. తన జీవితంలో అది ఒక అసహ్యకరమైన సంఘటన అనే చెప్పుకొచ్చింది. ఆ ఘటన తర్వాత డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపిందే.

తాను తీసుకున్న నిర్ణయం వల్ల తనకు భవిష్యత్తులో సినిమాల్లో అవకాశాలు రాకపోవచ్చని.. కానీ ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నానని తెలిపింది. తనతో అలా ప్రవర్తించిన నటుడి గురించి అందరికీ తెలుసునని.. కానీ ఎవరూ స్పందించలేదని తెలిపింది.

తాను తీసుకున్న నిర్ణయం వల్ల తనకు భవిష్యత్తులో సినిమాల్లో అవకాశాలు రాకపోవచ్చని.. కానీ ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నానని తెలిపింది. తనతో అలా ప్రవర్తించిన నటుడి గురించి అందరికీ తెలుసునని.. కానీ ఎవరూ స్పందించలేదని తెలిపింది.





























