Ram Charan: రామ్ చరణ్ నా ఫస్ట్ క్రష్.. మొత్తానికి అసలు విషయం చెప్పేసిన రవితేజ హీరోయిన్..
ఇప్పుడిప్పుడే తెలుగు సినీరంగంలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మాస్ మాహరాజ్ రవితేజ సరసన ఓ సినిమాలో నటించింది. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించకపోవడంతో ఈ అమ్మడుకు అంతగా క్రేజ్ రాలేదు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా తన ఫస్ట్ క్రష్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పుకొచ్చింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న చరణ్.. ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు.. ఇప్పుడు రామ్ చరణ్ తో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల విడుదలైన పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో చరణ్ ఊర మాస్ అవతారంలో కనిపించడం.. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కొల్లగొట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని.. తనే ఫస్ట్ క్రష్ అని.. ఎంతో క్యూట్ గా నవ్వుతారని మనసులోని మాటలు బయటపెట్టింది ఓ హీరోయిన్. ప్రస్తుతం ఆ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. తెలుగు హీరోయిన్ కావ్య థాపర్. మోడలింగ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ అమ్మడు.. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ఈగల్ చిత్రంలో కనిపించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ కావడంతో కావ్యకు అంతగా గుర్తింపు రాలేదు. అలాగే తెలుగులో సందీప్ కిషన్ జోడిగా ఊరు పేరు భైరవకోన, రామ్ పోతినేని జోడిగా డబుల్ ఇస్మార్ట్ చిత్రాల్లో నటించింది. గోపిచంద్ సరసన విశ్వం మూవీలో కనిపించినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు. ప్రస్తుతం కావ్య థాపర్ తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తుంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. తన ఫస్ట్ క్రష్ ఎవరని అడగ్గా.. రామ్ చరణ్ అని చెప్పుకొచ్చింది. అలాగే ఇండస్ట్రీలో చరణ్ తన ఫేవరెట్ హీరో అని.. తను ఎంతో క్యూట్ గా నవ్వుతారని తెలిపింది. కావ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. త్వరలోనే ఈ అమ్మడు చెర్రీతో కలిసి సినిమా చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. కావ్య థాపర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :