- Telugu News Photo Gallery Cinema photos Fans are disappointed with the long gap between star heroes films
Star Heroes: స్టార్ హీరోల సినిమాలకు లాంగ్ గ్యాప్.. ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదా.?
రెగ్యులర్‌గా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితేనే ఇండస్ట్రీకి మంచిది అని అందరూ చెబుతున్నా... ప్రాక్టికల్‌గా అది సాధ్యం కావటం లేదు. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలో బిజీగా మేకింగ్ పరంగా అవి ఎక్కువ టైమ్ తీసుకోవటంతో హీరోల కెరీర్‌లో లాంగ్ గ్యాప్ తప్పటం లేదు. ప్రజెంట్ స్టార్ హీరోలందరూ అలాంటి బ్రేక్‌లోనే ఉన్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Apr 15, 2025 | 5:05 PM

పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీని ఫైనల్ చేసేందుకు చాలా టైమ్ తీసుకున్నారు. ఆల్రెడీ లాక్ అయిన లైనప్‌ను పక్కన పెట్టి అట్లీని ప్రాజెక్ట్‌ను ముందు పట్టాలెక్కించారు. అయితే ఈ ప్రాసెస్‌లో ఎక్కువ టైమ్ వేస్ట్ కావటంతో మరోసారి బన్నీ కెరీర్‌లో లాంగ్ గ్యాప్ తప్పేలా లేదు.

బన్నీతో మూవీని గ్లోబల్ రేంజ్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నారు అట్లీ. మేకింగ్ టేకింగ్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ రేంజ్ సినిమా అంటే షూటింగ్‌కే ఏడాది సమయం పడుతుంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్‌కు మరో ఆరు నెలలు పక్కా. అంటే మరో ఏడాదిన్నర వరకు బన్నీని తెర మీద చూసే ఛాన్సే లేదు.

జక్కన్నతో మూవీ చేస్తున్న మహేష్‌ను మళ్లీ స్క్రీన్ మీద చూసేది ఎప్పుడన్నది ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఇప్పటికే మహేష్ మూవీ రిలీజ్ అయి ఏడాది దాటిపోయేది. మరో రెండేళ్ల వరకు మహేష్ నుంచి కనీసం అప్‌డేట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్సే లేందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

మూడు నాలుగు సినిమాలు సెట్స్ మీద పెట్టి వీలైనంత త్వరగా సినిమాలు ఫినిష్ చేయాలని చూస్తున్న ప్రభాస్ కూడా గ్యాప్‌ను తప్పించలేకపోతున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ది రాజాసాబ్ ఈ పాటికే రిలీజ్ కావాలి.

కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. సెట్స్ మీద ఉన్న ఫౌజీ పరిస్థితి ఏంటో తెలియదు. దీంతో డార్లింగ్ కెరీర్‌లోనూ మరో లాంగ్ గ్యాప్ తప్పేలా కనిపించటం లేదు. ఇంకా లైనప్‌లో చల్ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి.





























