- Telugu News Photo Gallery Cinema photos Tamannaah Bhatia is in a hurry, news is being heard in the industry
Tamannaah Bhatia: తూచ్ అలాంటిదేమీ లేదు అంటున్న తమన్నా.. ఎందుకు అలా అన్నట్టు.?
దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలనే సామెతకు స్టిక్ ఆన్ అయినట్టున్నారు మిల్కీబ్యూటీ. అందుకే ఆమె అంత తొందరపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. కానీ, తమన్నా మాత్రం... తూచ్ అలాంటిదేమీ లేదు.. అసలు అలా ఎందుకు మాట్లాడుతారని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Apr 15, 2025 | 6:12 PM

నషా నషా అంటూ ఈ మధ్య నార్త్ లో యమాగా స్టెప్పులేశారు మిల్కీబ్యూటీ. సౌత్‌లో స్పెషల్ సాంగులు చేయడం తమన్నాకు అలవాటే. అయితే ఈ మధ్య స్త్రీ2లో ఆమె చేసిన స్టెప్పులు చూశాక, నార్త్ మేకర్స్ కూడా తమన్నా కాల్షీట్ల కోసం ఎంక్వయిరీలు మొదలుపెట్టేశారు.

భారీ సినిమాల్లో అవకాశాలు లేకనే తమన్నా స్పెషల్ సాంగులు చేస్తున్నారా? అనే క్వశ్చన్ రెయిజ్ అయితే బిగ్ నో అనే మాట వినిపిస్తోంది. తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని, మంచి సినిమాల్లో పార్ట్ కావడమే కీలకమని స్టేట్‌మెంట్ ఇస్తున్నారు మిల్కీ బ్యూటీ.

సినిమా కథ నచ్చితే పెద్దదా, చిన్నదా అని చూడనన్నది తమన్నా చెబుతున్న మాట. అంతే కాదు, జనాలను మెప్పించి, బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించిన ప్రతి కథా తన దృష్టిలో పెద్దదేనంటున్నారు ఈ లేడీ.

ఇంతకీ తమన్నా పెళ్లెప్పుడు చేసుకుంటారని ఆరా తీస్తే... బిగ్ నో అనే మాట వినిపిస్తోంది. ఇప్పట్లో అలాంటి ఉద్దేశమే లేదన్నారు తమన్నా. కెరీర్ మీద దృష్టిపెడుతున్నానని చెప్పారు. విజయ్‌వర్మతో బ్రేకప్ అయిందంటూ ఈ మధ్య వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.

తెలుగులో ఆమె నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ఓదెల 2 ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మిల్కీ బ్యూటీ శివశక్తిగా కనిపించనుంది. ఇప్పట్టికే వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.





























