హీరోయిన్ అవ్వాలని వస్తే విలన్ను చేసేశారు.. సీరియల్లో గ్లామర్ అరాచకం
Rajitha Chanti
Pic credit - Instagram
సినిమాల్లో ఎలాగైనా హీరోయిన్ కావాలనుకుంది. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ ఊహించని విధంగా బుల్లితెరపై విలన్ అయ్యింది.
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం, ఫిట్‌నెస్ తో కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు బుల్లితెరపై నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేస్తుంది.
ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? నిజానికి ఆమె తెలుగమ్మాయి. కానీ ఇప్పుడు ఓ సీరియల్లో విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో జనాలను మెప్పిస్తుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ముద్దుగుమ్మ పేరు గాయత్రి సింహాద్రి. ప్రస్తుతం టీవీలో వస్తున్న కార్తీక దీపం 2 సీరియల్లో విలన్ గా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇందులో జ్యోష్న అనే పాత్రలో కన్నింగ్ లుక్, విలనీ స్మైల్.. న్యాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ తో ఆమెకు పాపులారిటి వచ్చింది.
గాయత్రి సింహాద్రి.. విజయవాడకు చెందిన ఆమె హీరోయిన్ కావాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చింది. మ్యాడ్ సినిమాలో గుర్తింపు లేని పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రాలేదు. కానీ టీవీ ఇండస్ట్రీ ఆమెను వెతుకుంటూ వచ్చింది. కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా ఆమె కెరీర్ మలుపు తిప్పిందినే చెప్పాలి.
ప్రస్తుతం జ్యోష్న పాత్రలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోషూట్లతో అరాచకం సృష్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ.