Rajinikanth: కడప పెద్ద దర్గాను దర్శించుకున్న సూపర్ స్టార్.. ఏఆర్ రెహమాన్‌తో కలిసి ప్రత్యేక ప్రార్దనలు..
వైఎస్సార్ జిల్లాలోని కడప పెద్ద దర్గాకి చేరుకున్నారు. అక్కడ తన కుమార్తె ఐశ్వర్య, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన కుమారుడు అమీన్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ పెద్ద దర్గాను తలైవా దర్శించుకోవడం ఇదే మొదటి సారి.
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలును సందర్శిస్తున్నారు. తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి ఈరోజు తెల్లవారుజామున తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న రజినీకి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన ఆయన.. వైఎస్సార్ జిల్లాలోని కడప పెద్ద దర్గాకి చేరుకున్నారు. అక్కడ తన కుమార్తె ఐశ్వర్య, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన కుమారుడు అమీన్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ పెద్ద దర్గాను తలైవా దర్శించుకోవడం ఇదే మొదటి సారి.
తొలిసారి కడప పెద్ద దర్గాకు సూపర్ స్టార్ రావడంతో ఆ ప్రాంతానికి భారీగా అభిమానులు చేరుకున్నారు. మరోవైపు ఏఆర్ రెహమాన్ కూడా ఉండడంతో వీరిని కలిసేందుకు భారీగా జనాలు రావడంతో.. పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రజినీ జైలర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తలైవ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.
అంతేకాకుండా.. తన కుమార్తె దర్శకురాలిగా తెరకెక్కిస్తున్న చిత్రాన్ని ఇటీవలే తలైవా ప్రారంభించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో రజినీ కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.