Pawan Kalyan-Ali: ‘పవన్ కళ్యాణ్‌కు.. నాకు మధ్య గ్యాప్ రాలేదు.. క్రియేట్ చేశారు’.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అలీ..
ఇటీవల అలీ కూతురు పెళ్లికి సైతం పవన్ రాకపోవడంతో వీరిద్దరి వైరం తీవ్ర స్థాయికి చేరిందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో పవన్ రాకపోవడానికి గల కారణాన్ని వివరించారు అలీ. తాజాగా మరోసారి వీరి మధ్య ఏర్పడిన మనస్పర్థల గురించి అలీ ఓపెన్ అయ్యారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లలో పవన్ కళ్యాణ్.. అలీ. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ స్టార్ ప్రతి సినిమాలో అలీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక వీరిద్దరి కాంబోని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలీ.. పవన్ కామెడీ థియేటర్లలో ప్రతి ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించేస్తుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. గబ్బర్ సింగ్ సినిమా చిత్రీకరణ నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. దీంతో వీడిపోయారని వార్తలు వినిపించాయి. ఇక చిన్నగా ఏర్పడిన దూరం పెరుగుతూ వచ్చింది. ఇటీవల అలీ కూతురు పెళ్లికి సైతం పవన్ రాకపోవడంతో వీరిద్దరి వైరం తీవ్ర స్థాయికి చేరిందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో పవన్ రాకపోవడానికి గల కారణాన్ని వివరించారు అలీ. తాజాగా మరోసారి వీరి మధ్య ఏర్పడిన మనస్పర్థల గురించి అలీ ఓపెన్ అయ్యారు.
అలీ హోస్ట్‌గా వచ్చే అలీతో సరదాగా షో ఇప్పుడు సరికొత్తగా ప్లాన్ చేశారు. ఎప్పుడూ అలీ ఉండే స్థానంలో యాంకర్ సుమ కనిపించగా..అతిథిగా అలీ విచ్చేశారు. ఈ షో ముగియబోతుందని.. త్వరలోనే మరో షోతో మీ ముందుకు వస్తామని అలీ తెలిపారు. ఈ షో ఇంతగా సక్సెస్ అయినందుకు అభినందిస్తూనే పలు ప్రశ్నలను సంధించింది. ముందుగా ఈ షో తొలిరోజు మంచు లక్ష్మిని ఇంటర్వ్యూ చేసినందుకు తనకు కృతజ్ఞతలు తెలిపారు అలీ సుమ.. అలీ మధ్య సరదాగా సాగిన సంభాషణలో మధ్యలో పవన్ కళ్యాణ్ గురించి ఓ ప్రశ్న వేసింది సుమ.
పవన్ కళ్యాణ్ కి మీకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అని సుమ ప్రశ్నించగా.. అలీ స్పందిస్తూ.. మా మధ్య ఎలాంటి గ్యాప్ రాలేదు.. క్రియేట్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ పవన్..అలీ మధ్య ఏం జరిగింది ?.. వీరిద్దరి మధ్య గ్యాప్ ఎవరు క్రియేట్ చేశారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.