- Telugu News Photo Gallery Cinema photos These are the favorite couples' movies that will be released in theaters in 2026
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
2026 రానుండటంతో ప్రతి ఒక్కరి చూపు తమ అభిమాన హీరో హీరోన్స్ పైనే ఉంటుంది.తమ అభిమాన హీరోల సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక కొంత మందికి మాత్రం తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్ కాంబోలో సినిమా రావాలనుకుంటారు. అయితే 20226లో క్రేజీ కాంబో ఉన్న మూవీస్ రిలీజ్ కానున్నాయంట. కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
Updated on: Dec 16, 2025 | 9:01 AM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా పెద్ది. ఈ మూవీ కోసం తెలుగు అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే క్రేజీ కాంబోతో తెరకెక్కుతున్న యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా మూవీ పెద్ది, 2026 మార్చిలో థియేటర్లో సందడి చేయనున్నట్లు సమాచారం.

అదే విధంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రామాయణం కూడా 2026లో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ మూవీపై కూడా టాలీవుడ్, బాలీవుడ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

2026లో అందాల ముద్దుగుమ్మ, యంగ్ బ్యూటీ శ్రీలీల రెండు సినిమాలతో సందడి చేయనుంది. ముఖ్యంగా ఇద్దరు క్రేజీ హీరోలతో ఈ చిన్నది జతకట్టనుంది. అందులో కార్తీక్ ఆర్యన్ ఒకరు. ఈ హీరో సరసన తూ మేరీ జిందగీ హై మూవీలో ఈ బ్యూటీ నటిస్తుంది.

అదే విధంగా ఇబ్రహీం అలీఖాన్ సరసన దిలేర్ అనే స్పోర్ట్స్ డ్రామా మూవీలో కూడా నటిస్తుంది. ఈ మూవీకి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కూడా 2026లో విడుదల కానుంది.

మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జంటను వెండితెరపై చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే వీరి కాంబోలో దో దివానే షెహర్ మే అనే రొమాంటిక్ మూవీ తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా కూడా 2026 ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.



