- Telugu News Photo Gallery Technology photos Another 5G smartphone from Motorola has arrived in the market.
పండుగ సీజన్ వేళ మార్కెట్లోకి అదిరిపోయే 5జీ ఫోన్.. ఫీచర్లు చూస్తే వారెవ్వా..
పండుగల సీజన్ మొదలు కావడంతో మొబైల్ తయారీ సంస్ధలన్నీ తమ కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తాయి. తాజాగా మోటోరోలా కంపెనీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ను మిడ్ రేంజ్ స్థాయిలో తీసుకొచ్చింది.
Updated on: Dec 15, 2025 | 9:17 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్ధ మోటరోలా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎడ్జ్ 70 పేరుతో ఈ మొబైల్‌ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తన ఎడ్జ్ వెర్షన్ లైనప్‌లో భాగంగా ఈ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెపిఫికేషన్లు, ధర వివరాలు ఇప్పుడు చూద్దాం.

20Hz 6.7-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ఉంటుంది. ఇక స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ఇందులో ఉంది. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా.. 68W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇక 5,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలోయూఐపై పని చేస్తుందని కంపెనీ తెలిపింది.

ఇక 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండగా.. 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 50MP పాంటోన్ వాలిడేటెడ్ ప్రైమరీ కెమెరా ఉండగా.. 50MP క్వాడ్ పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్ ఐపీ 68+ఐపీ 69 రేటింగ్‌ను కలిగి ఉంది

ఈ ఫోన్ ధర రూ.29,999గా ఉంది. ఇక యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్ కార్ట్ క్రెడిట్ కార్డుపై రూ.750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ప్లిప్ కార్డ్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, పాంటోన్ గాడ్జెట్ గ్రే, పాంటోన్ లిల్లీ ప్యాడ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

త్వరలో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వస్తుండటంతో.. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ లాంచ్ చేశారు. మార్కెట్లో ఈ ఫోన్ డిమాండ్ ఎలా ఉంటుందో చూడాలి.




