- Telugu News Photo Gallery Technology photos Railway Track Facts: How the railway track is protected from rusting?
Railway Track Facts: రైలు పట్టాలకు తుప్పు ఎందుకు పట్టదు.. అసలు మతలబ్ ఇదే..!
Indian Railways: ఇండియన్ రైల్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. కానీ వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోము. సాధారణంగా ఇనుముకు తుప్పు త్వరగా పడుతుంది. మరి రైలు పట్టాలకు తుప్పు పట్టాలి కదా.. కానీ ఎక్కడ ఆ తుప్పు పట్టినట్లు కనిపించదు. మరి ఎందుకో అని మరెప్పుడైనా ఆలోచించారా? అసలు కారణం ఇదే..
Updated on: Dec 16, 2025 | 11:29 AM

Railway Track Facts: సాధారణంగా చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ట్రాక్‌పై ఏ మాత్రం కదలకుండా వెళ్తుంది. దీని వల్ల మనకు అలసట అనేది ఉండదు. కానీ రైల్వే విషయంలో కొన్ని విషయాలు అందరికి తెలియవు. రైలు వెళ్లే పట్టాలు ఇనుముతో చేసి ఉంటాయి. ఇనుము అనేది ఎండకు ఎండుతూ వానకు తడుస్తుండటంతో తుప్పు పడుతుంటుంది.

కానీ రైలు పట్టాలు మాత్రం తుప్పు పట్టవు. అలా తుప్పు పట్టినట్లయితే ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కానీ రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు అనే అనుమానం చాలా మందిలో రావచ్చు. అందుకు కారణం కూడా లేకపోలేదు.

రైలు పట్టాలు ఇనుముతో చేసేవే అయినప్పటికీ.. వాటికి వినియోగించే ఉక్కు అధిక నాణ్యత కలిగి ఉంటుంది. ఈ ఉక్కులో 1శాతం కార్బన్, 12 శాతం మాంగనీస్ కలిసి ఉంటుంది. అందుకే దీనిని ‘సి-ఎంఎన్’ రైల్ స్టీల్ అని పిలుస్తారు. దీని కారణంగా తుప్పు పట్టడం చాలా తక్కువ.

ఒకవేళ తుప్పు పట్టినా.. తుప్పు రేటు సంవత్సరానికి 0.05 మి.మీ ఉంటుందట. అంటే 1 మి.మీ మేర తుప్పు పట్టడానికి 20 సంవత్సరాలు పడుతుంది. ఇక పట్టాలపై ఎప్పుడు రైలు ప్రయాణిస్తూనే ఉంటుంది కాబట్టి .. రైలు చక్రాల ఒత్తిడి కారణంగా పట్టాలు ఎలెప్పుడు పాలిష్ చేసిన మాదిరి మెరుస్తుంటాయి. అందుకే తుప్పు పట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

దీనికి తోడు కొంచెం పట్టాలు తేడా అనిపించినా రైల్వే సిబ్బంది వెంటనే ఆ పట్టాలను మార్చేస్తుంటారు. రైలు పట్టాలకు తుప్పు పట్టకుండా ఓ కోటింగ్ కూడా వేస్తారు. అలాగే రైళ్లు వెళ్తున్న సమయంలో పట్టాలు ఒత్తిడికి గురై తుప్పు పట్టవు.

ఇనుముకు తుప్పు ఎందుకు పడుతుంది..?: రైలు పట్టాలు తుప్పు పట్టకపోయినా..సాధారణం ఇనుముతో తయారు చేసిన వస్తువులు తుప్పు పడుతుంటాయి. తడిగా ఉన్నా, గాలిలో ఆక్సిజన్‌తో ప్రతిస్పందించినప్పుడు లేదా తడిగా ఉన్నప్పుడు ఇనుముపై గోధుమ రంగు ఐరన్ ఆక్సైడ్ నిక్షిప్తం చేయబడుతుంది. ఈ గోధుమ రంగు పూత ఇనుము ఆక్సిజన్‌తో ప్రతిస్పందించి ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. దీని కారణంగా తుప్పు పడుతుంది. ఇది తేమ కారణంగా జరుగుతుంది.




