AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టింది.. కట్ చేస్తే కనిపించకుండా పోయింది..! కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు

ముట్టుకుంటే కందిపోతుందేమో అనేలా ఉండే భామ.. గ్లామర్ ఒలకబోయడంలోనూ ముందుంటుంది.. చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి కూడా కానీ.. ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.. ఇప్పుడు అవకాశాలు లేక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టింది.. కట్ చేస్తే కనిపించకుండా పోయింది..! కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 16, 2025 | 10:10 AM

Share

తెలుగులో మెరుపుతీగలు చాలా మంది ఉన్నారు.. ఇలా వచ్చి అలా వెళ్లిన హీరోయిన్స్ మన దగ్గర చాలా మంది. కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత కనిపించకుండా మాయం అయ్యింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా ఆ కోవకే చెందిది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ రెండు పెద్ద హిట్స్ పడ్డాయి కానీ ఆతర్వాత అవకాశాలు అందుకోలేకపోయింది. ఇండస్ట్రీలో చాలా మంది భామలు కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి మెప్పించినా కూడా ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు కొందరు. చాలా మంది పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పేశారు. కానీ ఇంకొంతమంది ఆఫర్స్ లేక సతమతం అవుతున్నారు. ఇక అలాంటి వారిలో ఈ భామ ఒకరు.

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆఫర్స్ లేకపోయినా ఇప్పుడు తన అందాలతో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తుంది ఈ చిన్నది. పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ ఎవరో కాదు.. జూనియర్ ఐశ్వర్య రాయ్ గా క్రేజ్ తెచ్చుకున్న స్నేహాఉల్లాల్. 2007లో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందీ అందాల తార. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో మెప్పించింది. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన నీలికళ్లతో ఐశ్వర్యను గుర్తు చేస్తూ కుర్రకారును ఆగం చేసింది. ఆ తర్వాత కరెంట్ మూవీలో యంగ్ హీరో సుశాంత్ తో జతకట్టింది. ఈ సినిమా కూడా యూత్ ను బాగానే ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన సింహా సినిమాలోనూ హీరోయిన్ గా మెరిసింది. అయితే ఈ సినిమాల తర్వాత స్నేహ ఉల్లాల్ కు సినిమా అవకాశాలు కనుమరుగైపోయాయి. వరుడు, అలా మొదలైంది సినిమాల్లో క్యామియో రోల్స్ కే పరిమితమైంది. చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ తో కలిసి నటించిన మడత కాజా సినిమా కూడా పరాజయం పాలైంది. అలాగే యాక్షన్ త్రీడీ, అంతా నీమాయలోనే సినిమాల్లో మెరిసినా అవి కూడా ప్లాఫ్ లుగానే మిగిలిపోయాయి. కన్నడ, హిందీ సినిమాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. చివరిసారిగా 2022లో లవ్యూ లోక్ తంత్ర అనే హిందీ సినిమాలో నటించింది స్నేహ ఉల్లాల్. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. ఈ అమ్మడు క్రేజీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Sneha Ullal (@snehaullal)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
మహారాష్ట్రలో బ్యాన్‌ చేసిన ఈ అనలాగ్ పనీర్‌ గురించి తెలుసా!
మహారాష్ట్రలో బ్యాన్‌ చేసిన ఈ అనలాగ్ పనీర్‌ గురించి తెలుసా!