- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: These are the reasons why wealth does not increase in the house despite hard work
వాస్తు టిప్స్ : కష్టపడి పని చేసినా ఇంటిలో డబ్బు నిలవడం లేదా?
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉండే ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా మంది కష్టపడి పని చేసినప్పటికీ, తమ పని సమయానికి పూర్తి కాకపోవడం, ఇంటిలో సంపద నిలవకపోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటారు. అయితే దానికి ముఖ్య కారణం వాస్తు దోషం అంటున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
Updated on: Dec 16, 2025 | 8:15 AM

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలోని ఉత్తర దిశ, కెరీర్, అవకాశాల దిశగా పరిగణించబడుతుంది. అందువలన ఈ దిశలో ఎప్పుడూ చెత్త ఉండకుండా చూసుకోవాలి అంట. అదే విధంగా బరువైన వస్తువులు పెట్టకూడదు. ఎవరి ఇంటిలోనైతే ఉత్తరం దిశ చెత్తతో నిండిపోతుందో ఆ ఇంటిలో పురోగతి ఆగిపోతుందని చెబుతున్నారు వాస్తు పండితులు.

ఇంటికి శక్తినిచ్చే ది ప్రధాన ద్వారం. అందువలన ఇంటి ప్రధాన ద్వారం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంట.ఇంటి ముందు బూట్లు, చెప్పులు, వ్యర్థ పదార్థాలు, విరిగిన వస్తువులు లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

నైరుతి మూల స్థిరత్వం, నిర్ణయాత్మకతకు సంబంధించినది. ఈ మూల మురికిగా, ఖాళీగా లేదా చిందరవందరగా ఉండటం అస్సలే మంచిది కాదంట. దీని వలన కుటుంబ సభ్యల్లో ఒత్తిడి అధికం అవ్వడం, నిర్ణయాలు బలహీనంగా ఉండటం, పనుల్లో ఆలస్యం జరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

చాలా మంది పాత వార్తాపత్రికలు, దెబ్బతిన్న ఎలక్ట్రానిక్స్ వస్తువులు , విరిగిన ఫర్నిచర్‌ను ఇంట్లో దాచిపెడతారు. వాస్తు ప్రకారం, వ్యర్థాలు ప్రతికూల శక్తిని పెంచుతాయి, ఇది పనిలో అంతరాయాలు, మానసిక బద్ధకానికి దారితీస్తుంది. ఇంటి నుండి ఉపయోగించని వస్తువులను ఎప్పటికప్పుడు తొలగించడం చాలా అవసరం.

ఇంటిలో తప్పకుండా తగిన వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఎవరి ఇంటిలోనైతే తగినంత గాలి, వెలుతురు ఉండదో, వారి ఇంటి లోపల నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుందంట.



