ఇంత క్యూట్ అమ్మాయిని ఎలా మిస్ అయ్యంరా బాబు..! బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది అచ్చ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన వైష్ణవి.. నెమ్మిదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన వైష్ణని బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది.

అర్జున్ రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాల మాదిరిగా కల్ట్ క్లాసిక్‌లా ప్రేక్షకుల మన్ననలు పొందింది క్రేజీ మూవీ ‘బేబీ’. యూత్‌ను బాగా ఆకర్షించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధించింది. అలాగే డబుల్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బేబీ సినిమా థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ లాంటి వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవికి ఇది తొలి చిత్రం. మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆదరగొట్టింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వైష్ణవి స్నేహితురాలిగా కనిపించిన అమ్మాయి గుర్తుందా.. ? ఢీగ్లామర్ లుక్ లో కనిపించిన ఆ అమ్మాయి.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు.
మూవీ సెకండాఫ్‌లో హీరోయిన్ ప్రవర్తనకు నచ్చక.. ఆమె ఫ్రెండ్ వైష్ణవికి దూరంగా ఉంటుంది. తాను నటనతో అందరినీ ఆకర్షించింది. హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన ఆ చిన్నది ఎవరోనని నెటిజన్లు ఇంటర్నెట్‌లో తెగ వెతికేశారు. ఇంతకీ ‘బేబీ’ మూవీలో హీరోయిన్‌కు ఫ్రెండ్‌గా నటించిన ఆ అమ్మాయి మరెవరో కాదు.. ఆమె పేరు కుసుమ డేగలమారి. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ. ఇన్‌స్టాలో ఎప్పుడూ వీడియోలు, హాట్ ఫోటోలతో యాక్టివ్‌గా ఉంటుంది.
టాలీవుడ్‌లో బేబీ మొదటి చిత్రం కాగా.. తొలి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. బేబీ సినిమా తర్వాత ఈ భామకు వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సినిమాలతో కాకపోయినా సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








