5

Rashmika Mandanna: థియేటర్లలో కాదు.. ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న రష్మిక మందన్నా సినిమా.. ‘మిషన్ మజ్ను’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇటీవలే గుడ్ బై సినిమాతో నార్త్ ఆడియన్స్ ముందుకు వచ్చిన రష్మిక.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక మరోవైపు రష్మిక చేతిలో ఉన్న హిందీ చిత్రాల్లో మిషన్ మజ్ను ఒకటి.

Rashmika Mandanna: థియేటర్లలో కాదు.. ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న రష్మిక మందన్నా సినిమా.. 'మిషన్ మజ్ను' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Mission Majnu Movie Ott
Follow us

|

Updated on: Dec 14, 2022 | 1:10 PM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ మూవీతో అటు హిందీలోనూ భారీగానే ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం తెలుగుతోపాటు.. తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది. ఇటీవలే గుడ్ బై సినిమాతో నార్త్ ఆడియన్స్ ముందుకు వచ్చిన రష్మిక.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక మరోవైపు రష్మిక చేతిలో ఉన్న హిందీ చిత్రాల్లో మిషన్ మజ్ను ఒకటి. ఇందులో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటిని పెంచేశాయి. దీంతో ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే మిగిల్చారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు మేకర్స్.

వచ్చే ఏడాది జనవరి 20న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ నేషనల్ క్రష్.. ఎన్నో ఆశలతో బీటౌన్ లోకి అడుగుపెట్టింది. కానీ మొదటి సినిమా గుడ్ బై సరిగ్గా ఆడలేదు. ఇక రెండో సినిమా మిషన్ మజ్ను ఓటీటీలోకి రాబోతుంది. ఇక ఇప్పుడు అమ్మడు ఆశలన్నీ యానిమల్ సినిమాపైనే ఉన్నాయి. ఇందులో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. డైరెక్టర్ సందీప్ తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక మరోవైపు తెలుగులో అల్లు అర్జున్.. సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప 2 చిత్రంలోనూ నటిస్తుంది రష్మిక. అలాగే విజయ్ దళపతి, వంశీ పైడిపల్లి కాంబోలో రాబోతున్న వరిసు మూవీలోనూ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న పరిశుభ్రతపై భారీ కార్యక్రమం
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న పరిశుభ్రతపై భారీ కార్యక్రమం
వాగు ఒడ్డున ప్రసవం.. వైద్యులుగా మారిన 108 సిబ్బంది.
వాగు ఒడ్డున ప్రసవం.. వైద్యులుగా మారిన 108 సిబ్బంది.
మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. గణేష్‌ మండపంలో లడ్డును..
మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. గణేష్‌ మండపంలో లడ్డును..
మండపంలో లడ్డు ప్రసాదం కోసం హై సెక్యూరిటీ..ఖర్చు తెలిస్తే షాక్..
మండపంలో లడ్డు ప్రసాదం కోసం హై సెక్యూరిటీ..ఖర్చు తెలిస్తే షాక్..
ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌.. నెక్స్ట్ ఏంటీ..
ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌.. నెక్స్ట్ ఏంటీ..
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి..
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి..
స్మార్ట్ ఫోన్ ముందు దగ్గితే చాలు.. ఆ వ్యాధి తీవ్రత తెలిసిపోతుంది
స్మార్ట్ ఫోన్ ముందు దగ్గితే చాలు.. ఆ వ్యాధి తీవ్రత తెలిసిపోతుంది
ఈ 5 రకాల కిరాణా వస్తువులను పెద్ద మొత్తంలో అస్సలు కొనకూడదు
ఈ 5 రకాల కిరాణా వస్తువులను పెద్ద మొత్తంలో అస్సలు కొనకూడదు
బైక్‌ రైడింగ్‌లో కుర్రాళ్లకే సవాలు విసురుతున్న బామ్మ..
బైక్‌ రైడింగ్‌లో కుర్రాళ్లకే సవాలు విసురుతున్న బామ్మ..
వారణాసిలో ప్రధాని మోడీకి టీమ్ ఇండియా జెర్సీ బహుమతి..
వారణాసిలో ప్రధాని మోడీకి టీమ్ ఇండియా జెర్సీ బహుమతి..