AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Musings: ‘వాళ్లకు అది అవసరం.. మీరు పది నిమిషాల్లో నాశనం చేయకండి’.. పూరి జగన్నాథ్ రిక్వెస్ట్..

భూమిలో ఉండే ఈ హ్యూమస్ తయ్యారయ్యేందుకు చాలా కాలం పడుతుందని.. అది మొక్కలకు.. మట్టికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని.. దానిని కేవలం పది నిమిషాల్లో నాశనం చేస్తున్నారు.. అలా చేయకుండి

Puri Musings: 'వాళ్లకు అది అవసరం.. మీరు పది నిమిషాల్లో నాశనం చేయకండి'.. పూరి జగన్నాథ్ రిక్వెస్ట్..
Puri Musings
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2022 | 1:10 PM

Share

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పూరి మ్యూజింగ్స్ ద్వారా విభిన్న అంశాల గురించి తన స్టై్ల్లో వివరణ ఇస్తున్నారు. ఇప్పటికే తడ్కా.. మిర్రరింగ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్న పూరి.. ఇప్పుడు మట్టిలో ఉండే హ్యూమస్ గురించి చెప్పుకొచ్చారు. భూమిలో ఉండే ఈ హ్యూమస్ తయ్యారయ్యేందుకు చాలా కాలం పడుతుందని.. అది మొక్కలకు.. మట్టికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని.. దానిని కేవలం పది నిమిషాల్లో నాశనం చేస్తున్నారు.. అలా చేయకుండి అంటూ పూరి మ్యూజింగ్స్ ద్వారా రిక్వెస్ట్ చేశారు. ఇంతకీ హ్యూమస్ అంటే ఏమిటీ ?.. అది ఎవరికి ఉపయోగపం ?.. పూరి రిక్వెస్ట్ ఏంటీ ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

“హ్యూమస్ అనేది నల్లగా .. బ్రౌన్ కలర్ లో ఉండే ఆర్గానిక్ మెటిరియల్. ఇది మట్టిలో తయారవుతుంది. చెట్ల నుంచి రాలిపోయిన ఆకులు.. చనిపోయిన జంతువులు.. పురుగులు నేలలో కుళ్లిపోయి హ్యూమస్ తయారవుతుంది. చెత్త, వృథా ఆహారం ఒక చోట చేరి కుళ్లిపోయి.. దాని నుంచి హ్యూమస్ వస్తుంది. ఎన్నో చిన్న మొక్కలు దీనిపై ఆధారపడి బతుకుతాయి. అలాగే నేల దృఢంగా ఉండేందుకు హ్యూమస్ ఉపయోగపడుతుంది. మొక్కలకు..భూమికి ఎంతో ముఖ్యమైన నైట్రోజన్ హ్యూమస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కలకు బలాన్ని ఇచ్చి.. వ్యాధుల బారినుంచి కాపాడుతుంది. ఇది మొక్క వేళ్ల చుట్టూ పట్టుకుని ఉండడం వలన మనం నీళ్లు పోస్తే.. లోపలికి వెళ్లి.. వేర్లకు చేరుతుంది. ఆక్సిజన్ అందుతుంది.

హ్యూమస్ న్యాచురల్ గా రెడీ అవుతుంది. లేదా కంపోస్ట్ గా తయారవుతుంది. పెంటకుప్పలో మొక్కలకు.. పంట పొలాలకు కావాల్సిన నైట్రోజన్, ఫాస్పర్స, సల్ఫర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉత్పన్నమవుతాయి. ఇది రైతులకు చాలా ఉపయోగకరం. మిమ్మల్ని ఈ హ్యూమస్ తయారు చేయాలని చెప్పడం లేదు. దాన్ని పాడు చేయకుండా ఉంటారని చెబుతున్నా. చలికాలంలో మనమంతా చలి మంటలు వేసుకుంటాం. ఆ మంటల వల్ల భూమిలోని హ్యూమస్ నాశనమవుతుంది. అందుకే రోజుకో ప్రాంతంలో కాకుండా ఒకే చోట మంటలు వేసుకోండి. ఫైర్ ప్రూఫ్ షీట్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. అవి తీసుకుని.. వాటిపైనా మీరు చలి మంట కాచుకోవచ్చు. మట్టిలో హ్యమస్ తయారయ్యేందుకు చాలా కాలం పడుతుంది. దానిని మీరు పది నిమిషాల్లో నాశనం చేయొద్దని నా మనవి. హ్యూమస్ అంటే భూమి అని అర్థం.. హ్యూమస్ అనేది లాటిన్ పదం ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.