Prabhas: అన్‌స్టాపబుల్‌కు రావడమే పండగ అనుకుంటే.. ప్రభాస్ హెయిర్ స్టైల్ మరో బోనస్
అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యను డామినేట్ చేయడానికి ఖతర్నాక్ లుక్‌లో వచ్చారు ప్రభాస్. ఇక్కడికి కూడా క్యాప్‌తోనే వస్తారేమో అనుకుంటున్న సమయంలో.. సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.
అన్‌స్టాపబుల్‌కు ప్రభాస్ వచ్చారని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అక్కడేం మాట్లాడతారో అంటూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కానీ ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ విషయం దాగుంది. అదే ప్రభాస్ హెయిర్ స్టైల్.. కొన్ని నెలలుగా క్యాప్ పెట్టుకుని తిరుగుతున్న ప్రభాస్.. బాలయ్య ముందు కూల్ అండ్ స్టైలిష్‌గా మారిపోయారు. బాహుబలి ముందు వరకు ప్రభాస్ హెయిర్ స్టైల్ గురించి కానీ.. అతడి జుట్టు గురించి కానీ ఎప్పుడూ టాపిక్ రాలేదు. కానీ గత రెండేళ్లుగా రెబల్ స్టార్ హెయిర్ గురించి చర్చ బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్య ఎక్కడికి వచ్చినా కూడా జుట్టు కనిపించకుండా క్యాప్ పెట్టుకుని కవర్ చేస్తున్నారు. మొదట్లో దీనిపై చర్చ లేకున్నా.. ఈ మధ్య ఫ్యాన్స్‌లోనూ ఈ హెయిర్ టాపిక్ ట్రెండింగ్ అవుతుంది.
ప్రభాస్‌ను జుట్టుతో చూసిన సందర్భాలు ఈ మధ్య చాలా తక్కువగా ఉన్నాయి. చివరికి మొన్న కృష్ణ చనిపోయినపుడు మహేష్‌ను ఓదార్చే సమయంలోనూ జుట్టును కవర్ చేసారు. దానికి ముందు పెదనాన్న కృష్ణంరాజు పోయినపుడు కూడా హెయిర్ అంతంతమాత్రంగానే కనిపించింది. ఆ తర్వాత తలకు టోపీ పెట్టేసారు ప్రభాస్. సీతా రామం ప్రీ రిలీజ్‌లోనూ క్యాప్‌తోనే కనిపించారు రెబల్ స్టార్. హెయిర్ స్టైల్ కనబడకుండా ఎందుకు దాచేస్తున్నారనే కొత్త అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో తాజాగా ఆహాలో అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు ప్రభాస్. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూట్ అయిపోయింది. మిత్రుడు గోపీచంద్‌తో కలిసి ఈ షోకు వచ్చారు ప్రభాస్. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. హెయిర్ స్టైల్‌పై ప్రత్యేక చర్చ మొదలైంది.
అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యను డామినేట్ చేయడానికి ఖతర్నాక్ లుక్‌లో వచ్చారు ప్రభాస్. ఇక్కడికి కూడా క్యాప్‌తోనే వస్తారేమో అనుకుంటున్న సమయంలో.. సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. జుట్టుకు ఈయన వేవింగ్ చేయించుకున్నారనే ప్రచారం జరుగుతుంది. అంటే అది పూర్తిగా విగ్ కాదు.. అలాగని ఒరిజినల్ జుట్టు కాదు. ఏదైతేనేం.. ప్రభాస్ కొత్త లుక్ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..