RGV: వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ రైటర్.. తిట్టారా..? పొగిడారా సార్..
కొన్నాళ్లు ఆయన ఏంటి ఇలా అన్నారు.. ఇంకొన్నాళ్లు ఆయన్ను జైల్లో వేయాలన్నారు.. ఇప్పుడు వర్మ మన కర్మ అని లైట్ తీసుకుంటున్నారు జనాలు.
దృతరాష్ట్ర కౌగిలి ఈక్వెల్ టూ ఆర్జీవీ పొగడ్త..! మనసులో ఒకటి.. మాటల్లో మరోటి… తన ట్వీట్లలో ఇంకోటి! టార్గెట్ చేసేది ఒకరిని.. అందుకు వాడుకునేది మరొకరిని! చివరకు బలిపశువుని చేసేది ఇంకొకరిని! ఇలా తన సైకలాజికల్ స్కిల్స్ ఉపయోగించి.. అటెన్షన్ గ్రాబ్ చేసే ఫార్ములానే మాటి మాటికి యూజ్ చేసి ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నారు ఆర్జీవీ. ఇక అదే రూల్‌లో తాజాగా తనను తిడుతూ పొగిడిన స్టార్ రైటర్ కు దండం పెట్టి.. మరోసారి తన మార్క్ చాటుకున్నారు. సినిమాల్లో రైటర్‌గా.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో పంచ్ డైలాగ్స్ మేకర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు బీవీఎస్ రవి. ఈయన ఆర్జీవీకి మంచి సన్నిహితుడు. తాజాగా ఆర్జీవీ రిలీజ్ చేసిన ఓ ఇంటర్య్వూ పై షాకింగ్ కామెంట్స్ చేశారు బీవీఎస్ రవి. తనను కౌగిలించుకుని.. మరో 10 రోజులు స్నానం చేయనని స్టేట్మెంట్ ఇచ్చిన స్టేజీ అనే యువతితో .. వర్మ తాజాగా చేసిన ఇంటర్య్వూపై తనదైన స్టైల్లో కామెంట్ పెట్టారు రైటర్ రవి.
వర్మ, స్టేజీ ఇంటర్య్యూ లింక్‌ను పోస్ట్ చేస్తూ… “ఇదే ఇంటర్వ్యూ వంద ఏళ్ళ క్రితం వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఏభై ఏళ్ల క్రితం వస్తే వెలి వేసేవారు. ఇప్పుడు దాదాపుగా సమాజం బరి తెగించడం వల్ల మీరు బతికిపోయారు” అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఆర్జీవీ ఏ గ్రేడ్ పనులను తన రైటింట్ స్కిల్స్‌తో తన మార్క్ వేలో చెప్పేశారు. ఇతను ఆర్జీవీని, తిట్టాడా పొగడాడో ఎవరికి అర్థం కాలేదు.
ఇక ఈ ట్వీట్ ను చూసిన ఆర్జీవీ.. ఎప్పటిలాగే పొంగిపోయారు. దండం ఎమోజీతో బీవీఎస్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ఏంటో ఈ క్రియేటివ్ పీపుల్ ప్రేమలు, అభిమానాలు ఎవరికీ అర్థం కావు.
— Ram Gopal Varma (@RGVzoomin) December 14, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.