Bigg Boss 6: మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. అనుకోని పర్సన్ బయటకు.. అందుకే ఇలా

మిడ్ వీక్ ఎలిమినేషన్ అంతా గందరగోళంగానే ఉంది. ఏదో చేద్దామనుకుంటే బూమరాంగ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వీక్షకులు అయితే ఫ్లాప్ షో అని విమర్శలు గుప్పిస్తున్నారు.

Bigg Boss 6: మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. అనుకోని పర్సన్ బయటకు.. అందుకే ఇలా
Bigg Boss 6 Mid week elimination
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 15, 2022 | 4:35 PM

బిగ్ బాస్ సీజన్ 6 ఎండింగ్‌కు వచ్చేసింది. వచ్చే ఆదివారమే గ్రాండ్ ఫినాలే. ఈ క్రమంలోనే  గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నారు. ప్రజంట్ ఇంట్లో రేవంత్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్, శ్రీసత్య ఉన్నారు. వీరిలో ఒకరు నేడు బయటకు వెళ్లనున్నారు. అయితే  బుధవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్స్ లెక్కిస్తామని..  ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్‌ చేస్తామని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఓటింగ్ లైన్స్ యాక్టివ్‌గానే ఉండటంతో.. అసలు బిగ్ బాస్ టీం ఏం చేస్తున్నారన్నది అర్థం కావట్లేదు. కాగా ప్రజంట్ అందుతున్న లీకులను బట్టి చూస్తే.. శ్రీసత్యను మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. తొలుత రోహిత్‌ను పంపుదామని అనుకున్నా.. ఇనయా ఎలిమినేషన్ అన్‌ఫెయిర్ అంటూ ఇప్పటికే వీక్షకులు భగ్గుమంటున్నారు. ఇప్పుడు మళ్లీ రోహిత్‌ను బయటకు పంపింతే ఛీ కొడతారని వెనక్కి తగ్గినట్లు సమాచారం.

దీంతో బిగ్ బాస్ నిర్వాహకుల ఫేవరెట్ కంటెస్టెంట్ అయిన శ్రీసత్య బయటకు రాక తప్పని పరిస్థితులు వచ్చాయి. ఆరుగురిలో ఎలిమినేట్ అయినవారి ఫోటోను ఓటింగ్  నుంచి తీసేస్తే.. కిక్ పోతుందని.. అందరికీ రివీల్ అవుతుందని వాళ్లని కూడా ఓటింగ్ లైన్‌లో ఉంచారన్నది అర్థం అవుతుంది. కానీ దీని వల్ల ప్రాబ్లం ఏంటంటే.. ఎలిమినేట్ చేసిన వ్యక్తికి బుధవారం నైట్ నుంచి వేసిన ఓట్లన్నీ వేస్ట్ అయినట్లే. అంతేకాదు ఎలిమినేట్ అయినట్లు తెలిస్తే తమ ఇష్టమైన కంటెస్టెంట్‌కి వేయాల్సిన ఓట్లన్నీ.. మరో ప్రయారిటీలోని కంటెస్టెంట్‌కే వేసేవారు. అసలు చివరాకరకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నదే వేస్ట్ టాస్క్. ఫినాలేకి ముందు ఇలా ఎవరైనా చేస్తారా..? ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది.

ఏది ఏమైనా ఈ సీజన్ పరమ రొట్టగా సాగిందన్న పేరు ఉంది. కంటెస్టెంట్స్ కూడా చాలా ఫేక్‌గా బిహేవ్ చేశారు. దీనికి తోడు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్స్.  అదీ చాలనట్లు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే చాలా  గందరగోళంగా ఉంది. మొత్తానికి ఈ సీజన్‌ను కిక్ లేకుండా చేతులారా ముంచేశారన్నది వీక్షకుల వెర్షన్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.