Shriya Saran: ఆ కారణంతోనే ప్రెగ్నెన్సీ విషయం దాచాల్సి వచ్చిందంటున్న శ్రియ.. అలా చేస్తారనే భయమంటూ కామెంట్స్..

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా గడిపేస్తున్న శ్రియ.. 2018 లో ఆండ్రీ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నారు. మ్యారెజ్ తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుంది. అయితే ఇటీవల తన కూతురు రాధను అభిమానులకు పరిచయం చేసి షాకిచ్చింది.

Shriya Saran: ఆ కారణంతోనే ప్రెగ్నెన్సీ విషయం దాచాల్సి వచ్చిందంటున్న శ్రియ.. అలా చేస్తారనే భయమంటూ కామెంట్స్..
Shriya
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 15, 2022 | 4:55 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్ద కాలంగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ శ్రియ. తెలుగులోనే కాకుండా.. తమిళ్, హిందీలోనూ వరుస సినిమాల్లో కనిపించారు. ఇష్టం సినిమాతో కెరీర్ ప్రారంభించిన శ్రియ.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అగ్రకథానాయికగా కొనసాగింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా గడిపేస్తున్న శ్రియ.. 2018 లో ఆండ్రీ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నారు. మ్యారెజ్ తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుంది. అయితే ఇటీవల తన కూతురు రాధను అభిమానులకు పరిచయం చేసి షాకిచ్చింది. నిజానికి శ్రియకు ప్రెగ్నెంట్ అని.. కూతురు పుట్టిందని ఎవరికి తెలియదు. ఎప్పుడూ సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే శ్రియా.. ఎప్పుడు పాపకు జన్మనిచ్చిందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా తన ప్రెగ్నెన్సీని సీక్రెట్ గా ఉంచిన విషయం గురించి ఓపెన్ అయ్యారు.

ప్రస్తుతం శ్రియ.. హిందీలో దృశ్యం 2లో నటించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాలను పంచుకుంది. “ఒక నటిగా ప్రెగ్నెన్సీ విషయం చెప్పేందుకు చాలా భయపడ్డాను. ఒకవేళ మీడియాకు తెలిస్తే ఆ మాధుర్య క్షణాల్ని అనుభవించలేమో అని కంగారు పడ్డాను. ప్రెగ్నెన్సీ కారణంగా చాలా లావు అయ్యా ను. అలాగే శరీరంలో అనేక మార్పులు వచ్చాయి. దాంతో మీడియాతో పాటు.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారనుకున్నాను. అలాగే నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆ సమయంలోనూ ఎవరికీ చెప్పకుండా సినిమాల్లో నటించాను. కానీ నెలలు పెరిగే కొద్ది సినిమాలకు దూరంగా ఉండిపోయాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోనూ కీలకపాత్రలో నటించింది శ్రియా. ఇటు సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది.

కోళ్లు రాసిన చరిత్ర.. 'పందెంకోడి' సంస్కృతిలో ఎప్పుడు భాగమైందంటే?
కోళ్లు రాసిన చరిత్ర.. 'పందెంకోడి' సంస్కృతిలో ఎప్పుడు భాగమైందంటే?
iPhone 15: రూ.40 వేలకే ఐఫోన్‌ 15.. అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్‌..!
iPhone 15: రూ.40 వేలకే ఐఫోన్‌ 15.. అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్‌..!
నార్త్‌లో నాటు నాటు రిపీట్.. ఆ హీరోల డ్యాన్స్‌తో దబిడి దిబిడే!
నార్త్‌లో నాటు నాటు రిపీట్.. ఆ హీరోల డ్యాన్స్‌తో దబిడి దిబిడే!
పవర్‌ఫుల్ డ్రింక్.. ఉదయాన్నే తాగితే కొవ్వును ఇట్టే కరిగిస్తుంది
పవర్‌ఫుల్ డ్రింక్.. ఉదయాన్నే తాగితే కొవ్వును ఇట్టే కరిగిస్తుంది
ఇంట్లో శాంతి కోసం వాస్తు చిట్కాలు
ఇంట్లో శాంతి కోసం వాస్తు చిట్కాలు
డ్రగ్స్‌కేసులో జైల్లో వేశారు.. నాలుగేళ్ళ తర్వాత నిర్దోషిగా..
డ్రగ్స్‌కేసులో జైల్లో వేశారు.. నాలుగేళ్ళ తర్వాత నిర్దోషిగా..
2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించిన ఐఎండీబీ..
2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించిన ఐఎండీబీ..
శీతాకాలంలో యూరిక్‌ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా?
శీతాకాలంలో యూరిక్‌ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా?
ఇంత హైపర్ ఎందుకు?" తిలక్ వర్మ చరిత్ర సృష్టిస్తూనే..
ఇంత హైపర్ ఎందుకు?
ఐర్లాండ్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర రాసిన బీసీసీఐ అంపైర్ కుమార్తె!
ఐర్లాండ్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర రాసిన బీసీసీఐ అంపైర్ కుమార్తె!