AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యూజిక్‌తో కాదు..నటనతో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌‌

సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాక, మరో కొత్త పని చేయాలంటే కాస్త సంకోచిస్తారు. కానీ మన 'ఆస్కార్' విజేత మాత్రం అందుకు భిన్నం. తన మ్యూజిక్ నోట్స్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆయన, ఇప్పుడు సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.

మ్యూజిక్‌తో కాదు..నటనతో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌‌
Moon Walk Posters
Nikhil
|

Updated on: Jan 03, 2026 | 7:15 AM

Share

దాదాపు మూడు దశాబ్దాలుగా కోట్లాది మంది హృదయాలను తన మ్యూజిక్‌తో అలరించారు. ఆయన ట్యూన్ చేస్తున్నారంటే అభిమానులు ఫిదా కావాల్సిందే. ఈసారి కూడా అభిమానులను అలరించడానికి రెడీ అయ్యారు. కానీ మ్యూజిక్‌తో కాదు. నటనతో. అవును మీరు వింటున్నది నిజమే. కొన్ని సినిమాల్లో ఇలా కనిపించి అలా మాయమైన ఈ మ్యూజిక్ లెజెండ్ పూర్తి స్థాయి నటుడిగా వెండితెరపై కనిపించబోతున్నారు. అప్పట్లో కొన్ని సాంగ్స్ లో అలా మెరిసి ఇలా మాయమైనా, ఇప్పుడు మాత్రం ఒక పవర్ ఫుల్ పాత్రతో మన ముందుకు వస్తున్నారు.

ప్రభుదేవా సినిమాలో క్రేజీ రోల్..

ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో ఐకానిక్ సాంగ్స్ ఇచ్చిన ఈ మ్యూజికల్ లెజెండ్, ఇప్పుడు మరో లెజెండ్ ప్రభుదేవా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘మూన్‌వాక్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ మూవీలో ఆయన ఒక ‘ఫన్నీ అండ్ యాంగ్రీ యంగ్ డైరెక్టర్’గా కనిపించనుండడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు మనోజ్ ఎన్.ఎస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మ్యూజిక్ తో మేజిక్ చేసిన ఆయన, ఇప్పుడు కెమెరా ముందు యాక్టింగ్ తో ఎలాంటి మాయ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ar Rahman & Moon Walk Poster

Ar Rahman & Moon Walk Poster

ఇంట్రో అదిరిపోయింది..

మొదట ఈ సినిమాలో కేవలం ఒక పాటలో కనిపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ షూటింగ్ సమయంలో ఆయన నటన చూసి ముగ్ధుడైన దర్శకుడు, ఒక ముఖ్యమైన సీన్ కోసం అడగగా ఏఆర్ రెహమాన్ వెంటనే ఓకే చెప్పారట. “రెహమాన్ కి ఈ రోల్ చెప్పగానే చాలా ఉత్సాహంగా అంగీకరించారు. సెట్స్ లో ఆయన నటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు” అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ మూవీలో ఆయన కేవలం నటనకే పరిమితం కాకుండా, మొత్తం ఐదు పాటలను పాడటం మరో విశేషం. ఏఆర్ రెహమాన్ పాడిన ఈ సాంగ్స్ సినిమాకి హైలెట్ కానున్నాయి.

రామ్ చరణ్ సినిమాతో టాలీవుడ్ లో బిజీ..

ఒకపక్క నటుడిగా మారుతూనే.. మరోపక్క తన ప్రధాన రంగమైన సంగీతంలోనూ జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాకు ఈయనే సంగీతం అందిస్తున్నారు. 2026 మార్చిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, రచయితగా, నిర్మాతగా తన సత్తా చాటిన ఈ లెజెండ్.. ఇప్పుడు నటుడిగా తన కొత్త ఇన్నింగ్స్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. మే 2026లో విడుదల కానున్న ‘మూన్‌వాక్’ రెహమాన్ సినీ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!