02 January 2026
సలార్ సినిమా మిస్ అయిన హీరోయిన్.. ఎంతో బాధపడిందట.
Rajitha Chanti
Pic credit - Instagram
మలయాళీ బ్యూటీ మాళవిక మోహన్ తమిళం, మలయాళం సినిమాలతో ఫేమ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ మూవీలో ప్రభాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది మాళవిక.
సలార్ సినిమాలో ముందుగా తనకే ఛాన్స్ వచ్చిందని.. అందులో శ్రుతి హాసన్ చేసిన పాత్ర కోసం ముందుగా తననే అడిగారని చెప్పుకొచ్చింది మాళవిక.
సలార్ కోసం ముందుగా తానే వెళ్లి ప్రశాంత్ నీల్ ని కలిసానని.. ఆ సినిమా చేస్తానని అనుకున్నానని.. కానీ కొన్ని కారణాలతో తప్పుకున్నట్లు తెలిపింది.
ప్రభాస్ నటించి సలార్ సినిమా ఛాన్స్ మిస్సైనందుకు చాలా బాధపడ్డానని.. కానీ కొన్ని నెలలకే తనకు రాజా సాబ్ మూవీలో ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది.
రాజాసాబ్ సినిమా ఛాన్స్ రావడంతో చాలా సంతోషించానని.. ప్రభాస్ ను, తనను ప్రకృతి కలిపిందని తెలిపింది. ఇద్దర్ని విధి కలిపిందని చెప్పుకొచ్చింది.
ఇప్పటికే రాజాసాబ్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఇది హార్రర్ కామెడీ డ్రామా కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్