Puri Jagannadh: ఇడియట్ షూటింగ్లో రక్షితపై కోప్పడిన పూరి.. హీరోయిన్ రియాక్షన్ వేరేలెవల్..
తాజాగా కోపంలో కంట్రోల్ తప్పకుండా.. దేనికైనా బ్యాలెన్స్డ్ గా రిప్లయ్ ఇవ్వడం ఎలా నేర్చుకోవాలనే టాపిక్ పై లేటెస్ట్ మ్యూజింగ్ లో వెల్లడించాడు. అంతేకాదు.. దీనికి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఇక ఈరోజు కోపం వచ్చినప్పుడు ఎదుటివారికి మనం ఎలా సమాధానం ఇవ్వాలి..
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. పూరి మ్యూజింగ్స్ ద్వారా లైఫ్ ఫిలాసఫీని బోధిస్తున్నారు. మిర్రరింగ్.. హ్యూమస్.. ఇద్దరి విషయాల్లో మూడో వ్యక్తి చిచ్చుపెట్టడం.. లైఫ్.. ఒంటరితనం ఇలా అన్ని విభిన్న అంశాలను వివరిస్తున్నారు. తాజాగా కోపంలో కంట్రోల్ తప్పకుండా.. దేనికైనా బ్యాలెన్స్డ్ గా రిప్లయ్ ఇవ్వడం ఎలా నేర్చుకోవాలనే టాపిక్ పై లేటెస్ట్ మ్యూజింగ్ లో వెల్లడించాడు పూరి. అంతేకాదు.. దీనికి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఇక ఈరోజు కోపం వచ్చినప్పుడు ఎదుటివారికి మనం ఎలా సమాధానం ఇవ్వాలి.. ఏవిధంగా రియాక్ట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వెల్లడించారు.
“జీవితంలో చాలా జరుగుతాయి.. జరుగుతుంటాయి. వాటి మీద మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదు. మన చేతుల్లో ఉండేది ఒక్కటే. ఏం జరిగితే ఎలా రియాక్ట్ అవుతున్నామనేదే ముఖ్యం. ఎంత కష్టమొచ్చినా..ఏ సమస్య వచ్చిన మనం కామ్ గా రియాక్ట్ గా కావాలి. అరిచి గోల చేయడం.. తల బాదుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సమస్య ఎప్పుడూ సమస్య కాదు. సమస్యకు రియాక్ట్ అయ్యే విధానమే అసలు ప్రాబ్లమ్. బ్యాలన్స్ డ్ గా ఆలోచించడం.. ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. ఏం మాట్లాడినా.. మన ఎమోషన్స్ కంట్రోల్ పెట్టుకునే మాట్లాడాలి. మనకు కోపం వచ్చినప్పుడు సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిది. అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎవరికి సమాధానం ఇవ్వకూడదు.
ఇడియట్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక సీన్ లో రక్షిత ఎమోషనల్ కావాలి. ఏడవాలి. కానీ తను నవ్వుతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎమోషన్ రాలేదు. ఒకటి రెండు సార్లు చెప్పినా సీన్ రాలేదు. దీంతో చాలా కోపం వచ్చేసింది. వెంటనే అందరి ముందు ఆమె పై సీరియస్ అయ్యాను. నువ్వు ఇలాగే చేస్తే నెక్ట్స్ సినిమాలో నీకు క్యారెక్టర్ రాయను.. అని చెప్పాను. దీంతో ఆమె.. నువ్వు నాకు క్యారెక్టర్ రాయకపోతే నిన్ను చంపేస్తాను. నీ నెక్ట్స్ 10 చిత్రాల్లో కూడా నేనే చేస్తాను. ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పిచావ్ అనేసింది. దీంతో సెట్ లో ఉన్నవారు క్లాప్స్ కోట్టారు. కోపంగా ఉన్న నాకు కూడా నవ్వు వచ్చింది.
అందుకే మన రియాక్షన్ అనేది చాలా నాన్సెన్స్ తగ్గిస్తుంది. సోషల్ మీడియాలో ఎవరెవరో పోస్టులు పెడుతుంటారు. ప్రతిదానికి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. మనకు పనికొచ్చే వాటికే మనం రియాక్ట్ అవుదాం. నవ్వుతూ మీరు చెప్పే సమాధానం.. లేదా ఏ ఆన్సర్ ఇవ్వకుండా చిరునవ్వుతో వెళ్లిపోవడం చాలా సమస్యలను తగ్గిస్తాయి. ” అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.