Toxic Movie: యశ్ టాక్సిక్‌లో మరో హాట్ బ్యూటీ.. ఎలిజబెత్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తోన్న 'టాక్సిక్' నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రం నుంచి హ్యుమా ఖురేషి ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం బృందం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని 'కెవిఎన్ ప్రొడక్షన్స్' నిర్మిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 19 న ఈ సినిమా విడుదల కానుంది.

‘రాకింగ్ స్టార్’ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటిస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులు మిగిలి ఉంది. అయితే ప్రమోషన్లు మాత్రం విస్తృతంగా చేస్తున్నారు. ఈ సినిమాలోని నటీనటుల పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్నారు. యష్ తో పాటు , ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ ఆర్టిస్టులు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కియారా అద్వానీ, హ్యుమా ఖురేషి తదితర స్టార్స్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగం కానున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి హుమా ఖురేషి పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ‘టాక్సిక్’ సినిమాలో ఎలిజబెత్ పాత్రలో హుమా ఖురేషి నటిస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఈ పాత్ర చాలా రిచ్ గా ఉంది. గ్లామరస్ డ్రెస్ వేసుకుని రెట్రో లగ్జరీ కారు ముందు నిలబడి ఉన్న హుమా ఖురేషి లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హ్యుమా ఖురేషి వయసు ఇప్పుడు 39 సంవత్సరాలు. ఆమె సినిమాల్లో నటించడమే కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడానటిస్తోంది. ఇప్పుడు ‘టాక్సిక్’సినిమా ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిందీ అందాల తార. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.
టాక్సిక్ సినిమాలో హ్యుమా ఖురేషి..
Introducing Huma Qureshi @humasqureshi as ELIZABETH in – A Toxic Fairy Tale For Grown-Ups #TOXIC #TOXIConMarch19th #TOXICTheMovie @thenameisyash @advani_kiara #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar… pic.twitter.com/csJhb7Jxyy
— KVN Productions (@KvnProductions) December 28, 2025
‘టాక్సిక్’ సినిమాను కన్నడ, ఇంగ్లీషు భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. దీనిని ఇతర భాషల్లోకి డబ్ చేస్తున్నారు. ‘కె.వి.ఎన్. ప్రొడక్షన్స్’ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. యష్, నయనతార, కియారా అద్వానీ, అక్షయ్ ఒబెరాయ్, తారా సుతారియా, టోవినో థామస్, రుక్మిణి వసంత్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నటి కియారా అద్వానీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో ఆమె నదియా పాత్రను పోషిస్తోంది. గీతు మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత యష్ అంగీకరించిన సినిమా ఇది కాబట్టి, ‘టాక్సిక్’ పై చాలా అంచనాలు ఉన్నాయి.
టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ..
Introducing @advani_kiara as NADIA in – A Toxic Fairy Tale For Grown-Ups #TOXIC #TOXICTheMovie @thenameisyash #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar #KunalSharma #SandeepSharma #JJPerry @anbariv… pic.twitter.com/glUFoVh6C1
— KVN Productions (@KvnProductions) December 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




